అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ACB Raid | మరో అవినీతి అధికారిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మహబూబాబాద్ జిల్లా (Mahabubabad district) పెద్దవంగర తహశీల్దార్ మహేందర్ రైతు నుంచి లంచం తీసుకుంటుండగా అరెస్ట్ చేశారు.
అవినీతి అధికారులు ఏ మాత్రం భయపడటం లేదు. నిత్యం ఏసీబీ దాడులు జరిగి పలువురు దొరుకుతున్నా.. లంచాలు తీసుకోవడం ఆపడం లేదు. లంచం తీసుకుంటే కఠిన చర్యలు లేకపోవడంతో అవినీతి అధికారులు రెచ్చిపోతున్నారు. నాలుగు రోజుల సస్పెన్షన్ తర్వాత మళ్లీ విధుల్లోకి తీసుకుంటారనే ధీమాతో ప్రజలను పట్టి పీడిస్తున్నారు. తాజాగా భూ భారతి రికార్డుల్లో (Bhu Bharati records) రైతు పేరు నమోదు చేయడానికి లంచం డిమాండ్ చేసిన తహశీల్దార్‌ను ఏసీబీ అధికారులు వల పన్ని పట్టుకున్నారు.
ACB Raid | భూమి మార్పిడి కోసం..
పెద్దవంగర మండలానికి (Peddavangara mandal) చెందిన ఓ రైతు మృతి చెందాడు. ఆయన పేరిట ఉన్న భూమిని తన పేరు మీదకు మార్చాలని ఆయన కుమారుడు తహశీల్దార్ వీరగంటి మహేందర్‌ను కలిశాడు. ఇందు కోసం తహశీల్దార్ రూ.25 వేల లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు శుక్రవారం లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు తహశీల్దార్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం కార్యాలయంలో సోదాలు నిర్వహించారు.
ACB Raid | లంచం అడిగితే ఫోన్ చేయండి
ప్రజలు అధికారులకు లంచాలు ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు (ACB Officers) సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా ఏసీబీకి ఫోన్ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్ ఫ్రీ నంబర్ (ACB Toll Free Number), వాట్సాప్ నంబర్ 9440446106కు సమాచారం అందిస్తే అవినీతి అధికారుల పని పడతామని భరోసా ఇస్తున్నారు.
ఎంత మొత్తం లంచం అడిగినా.. వస్తు రూపంలో బహుమతులు అడిగినా తమకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు. ఏసీబీకి ఫిర్యాదు చేస్తే తర్వాత తమ పనులు కావేమోనని పలువురు భయపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు. ఎలాంటి భయం వద్దని, ఆ పని పూర్తయ్యే వరకు బాధితులకు ఏసీబీ అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.