Homeజిల్లాలుకరీంనగర్ACB | ఏసీబీకి చిక్కిన మరో అధికారి.. రూ.22 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఆర్టీవో

ACB | ఏసీబీకి చిక్కిన మరో అధికారి.. రూ.22 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఆర్టీవో

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: ACB | రాష్ట్రంలో ఏసీబీ అధికారులు (ACB officials) నిత్యం అవినీతి అధికారులను పట్టుకుంటున్నా వారిలో మార్పు రావడంలేదు. ఏ మాత్రం భయం లేకుండా ప్రజల వద్ద నుంచి లంచాలు డిమాండ్​ చేస్తున్నారు. కార్యాలయాలకు వివిధ పనుల నిమిత్తం వచ్చే వారిని డబ్బుల కోసం వేధిస్తున్నారు. పైసలు ఇవ్వనిదే పనులు చేయడం లేదు. కింది స్థాయి నుంచి ఉన్నతాధికారి వరకు లంచాలు వసూలు చేస్తున్నారు. తాజాగా లంచం తీసుకుంటూ జగిత్యాల ఆర్టీవో (Jagityala RTO) పట్టుబడ్డాడు.

ACB | వివరాల్లోకి వెళ్తే..

జగిత్యాల జిల్లా డీటీవో బానోత్​ భద్రునాయక్​ (Jagityal district DTO Banoth Bhadrunayak) ఓ వ్యక్తి నుంచి రూ.22 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. కోరుట్లకు చెందిన ఓ జేసీబీ యజమాని నుంచి తన డ్రైవర్​ ద్వారా బుధవారం లంచం డబ్బులు తీసుకుంటుండగా కరీంనగర్​ ఏసీబీ డీఎస్పీ (Karimnagar ACB DSP) ఆధ్వర్యంలో రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. తనిఖీల్లో భాగంగా డీటీవో ఓ జేసీబీని పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి రూ.35 వేలు డిమాండ్​ చేయగా.. చివరకు డీటీవో డ్రైవర్​ (DTO driver) ద్వారా రూ.22 వేలకు జేసీబీ డ్రైవర్​ బేరం కుదుర్చుకున్నాడు. అనంతరం ఏసీబీని ఆశ్రయించారు. ఈ క్రమంలో బుధవారం రూ.22 లక్షల లంచం తీసుకుంటుండగా డీటీవోతో పాటు అతని డ్రైవర్​ను పట్టుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించారు. కాగా.. సదరు అధికారి గతంలో రెండు ఏసీబీ అధికారులకు పట్టుబడడం గమనార్హం.

ACB | లంచం అడిగితే ఈ నంబర్లకు ఫిర్యాదు చేయండి

ప్రజలు అధికారులకు లంచాలు ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా ఏసీబీకి ఫోన్​ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్​ ఫ్రీ నంబర్ (ACB Toll Free Number)​, వాట్సాప్ నంబర్​ 9440446106కు సమాచారం అందిస్తే అవినీతి అధికారుల పని పడతామని తెలుపుతున్నారు. ఏసీబీకి ఫిర్యాదు చేస్తే తర్వాత తమ పనులు కావేమోనని పలువురు భయపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు. ఎలాంటి భయం వద్దని, సదరు పని పూర్తయ్యే వరకు బాధితులకు ఏసీబీ అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.