ePaper
More
    HomeతెలంగాణACB Raid | ఇందిరమ్మ ఇల్లు బిల్లు కోసం లంచం.. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

    ACB Raid | ఇందిరమ్మ ఇల్లు బిల్లు కోసం లంచం.. ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raid | పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం (Indiramma Housing Scheme) ప్రవేశ పెట్టింది. అర్హులైన పేదలకు ఇళ్లు మంజూరు చేసింది. అయితే ఇళ్ల విషయంలో కొందరు అధికారులు లంచాలు తీసుకుంటున్నారు.

    ఇందిరమ్మ ఇళ్ల మంజూరు సమయంలో పలువురు అధికారులు డబ్బులు డిమాండ్​ చేశారు. ఇళ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు ప్రభుత్వం దశల వారీగా నిధులు మంజూరు చేస్తోంది. బేస్​మెంట్​ లెవల్​ వరకు పూర్తయితే రూ.లక్ష ఖాతాల్లో జమ చేస్తోంది. అయితే బిల్లుల చెల్లింపు కోసం సైతం పలువురు పంచాయతీ కార్యదర్శలు డబ్బులు వసూలు చేస్తున్నారు. తాజాగా ఇందిరమ్మ ఇల్లు బిల్లు కోసం లంచం తీసుకుంటున్న పంచాయతీ కార్యదర్శిని ఏసీబీ (ACB) అధికారులు పట్టుకున్నారు.

    ACB Raid | రూ.20 వేలు డిమాండ్​

    మంచిర్యాల (Mancherial) జిల్లా హాజీపూర్ మండలం కర్ణమామిడి గ్రామ పంచాయతీ కార్యదర్శిగా అక్కల వెంకట స్వామి పనిచేస్తున్నారు. గ్రామంలో ఓ వ్యక్తి ఇందిరమ్మ ఇల్లు బేస్​మెంట్​ లెవల్ వరకు పూర్తి చేశాడు. ప్రభుత్వం నుంచి రూ.లక్ష బిల్లు కోసం బేస్​మెంట్​ ఫొటోలు తీసి, ఇంటి నిర్మాణ పురోగతిని యాప్​లో అప్​లోడ్ చేయడానికి కార్యదర్శి రూ.20 వేల లంచం డిమాండ్​ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు సమాచారం అందించాడు. ఈ మేరకు బాధితుడి నుంచి రూ.20 వేల లంచం తీసుకుంటుండగా.. జీపీ కార్యదర్శి వెంకటస్వామిని ఏసీబీ అధికారులు బుధవారం పట్టుకున్నారు. ఆయనపై కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు.

    More like this

    Garlic Uses | నిద్రపోయే ముందు వెల్లుల్లి తీసుకుంటే..

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Garlic Uses | వెల్లుల్లి మన వంటింట్లో ఆహారాలకు రుచిని, సువాసనను అందించడమే కాదు, ఎన్నో...

    Dilraju wife | సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్న దిల్ రాజు భార్య‌.. కొంప‌దీసి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుందా ఏంటి?

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Dilraju wife | తెలుగు చిత్ర పరిశ్రమలో బడా నిర్మాతగా పేరు సంపాదించుకున్న దిల్‌రాజు Dil...

    Nizamabad | పబ్లిక్ ప్రాసిక్యూటర్లలను సన్మానించిన సీపీ

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad | ఐదుగురు పబ్లిక్ ప్రాసిక్యూటర్లను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (CP...