ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​ACB trap | ఏసీబీ వలకు చిక్కిన అవినీతి చేప.. లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన...

    ACB trap | ఏసీబీ వలకు చిక్కిన అవినీతి చేప.. లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన సబ్ రిజిస్ట్రార్

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ACB trap : అవినీతి అధికారులు ఏ మాత్రం మారడం లేదు. సామాన్య ప్రజల నుంచి మొదలు పెడితే బడా వ్యాపారుల వరకు ఎవరిని వదలడం లేదు. అందరిని లంచాల(Bribe) పేరిట వేధిస్తున్నారు. ఎంతొస్తే అంత అన్నట్లు వారి స్థాయిని బట్టి డబ్బులు డిమాండ్​ చేస్తున్నారు. పైసలు ఇస్తేనే పనులు చేపడుతున్నారు.

    రిజిస్ట్రేషన్​ కార్యాలయాల్లో అవినీతికి అంతే లేకుండా పోతోంది. పొలం, ప్లాట్లు, ఇల్లు, ఫ్లాట్​ ఏది కొనుగోలు రిజిస్ట్రేషన్​ చేయించుకోవాలన్నా భారీ మొత్తంలో అధికారులకు లంచం ఇచ్చుకోవాల్సి వస్తోంది. తాజాగా వ్యవసాయ భూమిని రిజిస్ట్రేషన్​ చేయించుకునే క్రమంలో సబ్​ రిజిస్ట్రార్​ Sub-Registrar భారీ మొత్తంలో లంచం డిమాండ్​ చేసి, చివరికి ఏసీబీకి చిక్కాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్​ Andhra Pradesh లోని అనంతపురం జిల్లా Anantapur district లో చోటుచేసుకుంది.

    ఓ రియల్​ ఎస్టేట్​ వ్యాపారి real estate businessman ఒకటిన్నర ఎకరం పొలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లాడు. కాగా, ఆ ల్యాండ్​ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నందున.. కమర్షియల్ భూమి కిందికి వస్తుందని, వ్యవసాయ భూమి కింద రిజిస్ట్రేషన్ చేయడం సాధ్యం కాదని సబ్ రిజిస్టర్ తేల్చి చెప్పాడు.

    ఒకవేళ రియల్టర్​ కోరిన విధంగానే కావాలంటే డబ్బులు ఇచ్చుకోవాల్సి ఉంటుందని సదరు అధికారి చెప్పి, లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయాడు.

    ACB trap : రూ. ఐదు లక్షలు డిమాండ్​..

    అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం Kalyanadurgam ఇన్​ఛార్జి సబ్ రిజిస్టార్ నారాయణస్వామి అవినీతికి పరాకాష్టగా నిలిచాడు. నాగేంద్ర నాయక్ అనే వ్యాపారి కళ్యాణదుర్గం మున్సిపాలిటీ ఏరియాలో ఒకటిన్నర ఎకరం పొలం కొన్నారు. ఆ ల్యాండ్​ రిజిస్ట్రేషన్ చేయించుకుందామంటే.. కళ్యాణదుర్గం సబ్ రిజిస్టర్ నారాయణస్వామి మెలిక పెట్టాడు. అది వాణిజ్యభూమి అని, వ్యవసాయభూమిగా రిజిస్ట్రేషన్ చేయాలంటే రూ. 5 లక్షలు చెల్లించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశాడు ఆ అవినీతి అధికారి.

    దీంతో వ్యాపారి నాగేంద్ర నాయక్​ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో ఏసీబీ అధికారులు ప్రణాళిక రూపొందించారు. అనంతపురంలోని నారాయణస్వామి ఇంటి సమీపంలో నాగేంద్ర నాయక్ నుంచి అధికారి డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ దాడి చేసింది. అవినీతి అధికారి నారాయణస్వామిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది.

    More like this

    Hydraa | 600 గ‌జాల స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో ప్రభుత్వ, ప్రజా ఆస్తులను హైడ్రా అధికారులు కాపాడున్నారు....

    Revanth meet Nirmala | కళాశాలల్లో అత్యాధునిక ల్యాబ్​ల ఏర్పాటుకు రూ. 9 వేల కోట్లు..!

    అక్షరటుడే, హైదరాబాద్: Revanth meet Nirmala : తెలంగాణ విద్యా రంగంలో స‌మూల‌ మార్పులు తేవ‌డానికి తాము చేస్తున్న‌...

    Nara Lokesh | కేటీఆర్​ను కలిస్తే తప్పేంటి.. ఏపీ మంత్రి లోకేష్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​ను కలిస్తే...