అక్షరటుడే, వెబ్డెస్క్ : Schools | రాష్ట్రంలో జూన్ 12 నుంచి పాఠశాలలు పున: ప్రారంభం (Schools Reopen) కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యా శాఖ అకడమిక్ క్యాలెండర్ (Academic Calender) ను విడుదల చేసింది. 2025–26 విద్యా సంవత్సరంలో పరీక్షలు, సెలవుల తేదీలను వెల్లడించింది. ఈ మేరకు అన్ని జిల్లాల డీఈవో (DEO)లకు ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 12 నుంచి పాఠశాలలు పున: ప్రారంభం అవుతాయని తెలిపింది. 2026 ఏప్రిల్ 23 వరకు బడులు కొనసాగుతాయని స్పష్టం చేసింది. మొత్తం 230 రోజులు పాఠశాల పనిదినాలుగా విద్యా శాఖ తెలిపింది.
Schools | సకాలంలో సిలబస్ పూర్తి చేయాలి
విద్యార్థులకు సకాలంలో సిలబస్(Syllabus) పూర్తి చేసేలా పాఠశాల ప్రారంభం నుంచే చర్యలు చేపట్టాలని విద్యాశాఖ ఆదేశించింది. పదో తరగతి విద్యార్థులకు 2026 జనవరి 10లోపు కంప్లీట్ చేయాలని పేర్కొంది. అప్పటి నుంచి ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ వరకు రీవిజన్ చేపట్టాలని సూచించింది. ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు 2026 ఫిబ్రవరి 28లోగా సిలబస్ పూర్తి చేయాలని ఆదేశించింది. ఈ నెల 6 నుంచి 19 వరకు బడిబాట కార్యక్రమం చేపట్టాలని ఉపాధ్యాయులకు సూచించింది.
Schools | పరీక్షల తేదీలు
- ఫార్మటివ్ అసెట్మెంట్ (FA) –1 పరీక్షలు జూలై 31 లోపు నిర్వహించాలి.
- ఎఫ్ఏ–2 : సెప్టెంబర్ 30 లోపు
- సమ్మటివ్ అసెట్మెంట్ (SA) –1 : అక్టోబర్ 24 నుంచి 31 వరకు
- ఎఫ్ఏ –3 : డిసెంబర్ 23లోపు
- ఎఫ్ఏ –4 : పదో తరగతి విద్యార్థులకు ఫిబ్రవరి 7లోగా.. మిగతా వారికి ఫిబ్రవరి 28లోగా నిర్వహించాలి.
- ఎస్ఏ – 2 : 2026 ఏప్రిల్ 10 నుంచి 18 వరకు (1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు..)
- ఎస్ఎస్సీ (SSC) ప్రీ ఫైనల్ : ఫిబ్రవరి 28 లోపు
- ఎస్ఎస్సీ (SSC) వార్షిక పరీక్షలు : 2026 మార్చి
Schools | సెలవులు
- దసరా సెలవులు : సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 03 వరకు (13 రోజులు)
- క్రిస్టమస్ సెలవులు : డిసెంబర్ 23 నుంచి 27 వరకు (మిషనరీ స్కూళ్లకు మాత్రమే)
- సంక్రాంతి సెలవులు : 2026 జనవరి 11 నుంచి 15 వరకు