- Advertisement -
Homeక్రీడలుIPL 2025 | రికార్డు సృష్టించిన అభిషేక్ శర్మ.. ఒకే మ్యాచ్​లో అత్యధిక క్యాచ్​లు..

IPL 2025 | రికార్డు సృష్టించిన అభిషేక్ శర్మ.. ఒకే మ్యాచ్​లో అత్యధిక క్యాచ్​లు..

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : IPL 2025 | సన్‌రైజర్స్ హైదరాబాద్ SRH విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ abhishek sharma చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌ iplలో చెన్నై సూపర్ కింగ్స్‌ cskపై ఒకే మ్యాచ్‌లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ఆటగాడిగా నిలిచాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ శర్మ ఏకంగా నాలుగు క్యాచ్‌లు అందుకున్నాడు.

తన స్టన్నింగ్ ఫీల్డింగ్‌తో సీఎస్‌కే csk కీలక బ్యాటర్లు అయిన షేక్ రషీద్, శివమ్ దూబె, దీపక్ హుడా, ధోనీలను పెవిలియన్ చేర్చాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడి 22 క్యాచ్‌లు అందుకున్నాడు. ఓవరాల్ ఐపీఎల్‌లో అభిషేక్​ శర్మ క్యాచింగ్ సామర్థ్యం 71 శాతంగా ఉండగా.. ఈ సీజన్‌లోనే 71.4 శాతంగా నమోదవ్వడం గమనార్హం.

- Advertisement -

సీఎస్‌కేపై ఓ మ్యాచ్‌లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న జాబితాలో అభిషేక్ శర్మ తర్వాత ఏబీ డివిలియర్స్ (దిల్లీ క్యాపిటల్స్, జొహన్నెబర్గ్ 2009), ఆర్పీ సింగ్ (డెక్కన్ ఛార్జెర్స్, చెన్నై, 2010), ఏంజెలో మ్యాథ్యూస్ (పీడబ్ల్యూఐ, చెన్నై 2012), రోహిత్ శర్మ (ముంబై ఇండియన్స్, బెంగళూరు, 2012) ఉన్నారు. వీరంతా సీఎస్కేపై తలో మూడు క్యాచులు అందుకున్నారు. అభిషేక్ ఫీల్డింగ్‌కు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ pat cummins ఫిదా అయ్యాడు. మ్యాచ్ అనంతరం అతను అందుకున్న క్యాచ్‌ల గురించి మాట్లాడుతూ ప్రశంసల జల్లు కురిపించాడు.

ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ SRH 5 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించింది. 12 ఏళ్ల తర్వాత చెన్నై గడ్డపై విజయం సాధించింది. ఈ గెలుపుతో ప్లే ఆఫ్స్ play offs అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. మరోవైపు సీఎస్‌కే ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News