ePaper
More
    Homeక్రీడలుMadhya Pradesh League | 33 బంతుల్లోనే సెంచ‌రీ.. వైభవ్ సూర్యవంశీ రికార్డ్ బ్రేక్ అయిందిగా..!

    Madhya Pradesh League | 33 బంతుల్లోనే సెంచ‌రీ.. వైభవ్ సూర్యవంశీ రికార్డ్ బ్రేక్ అయిందిగా..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: IPL | ఐపీఎల్‌లో IPL పంజాబ్ త‌ర‌పున ఆడిన వైభ‌వ్ సూర్య‌వంశీ(Vaibhav Suryavanshi) కేవ‌లం 35 బంతుల్లోనే సెంచ‌రీ చేశాడు. ఇది టీ20 లీగ్ చరిత్రలో రెండో వేగవంతమైన సెంచరీ. అయితే ఇప్పుడు మధ్యప్రదేశ్ లీగ్‌లో (Madhya Pradesh League) అభిషేక్ పాఠక్ (Abhishek Pathak) వైభవ్ సూర్యవంశీ కంటే వేగంగా సెంచరీ కొట్టాడు. కేవలం 33 బంతుల్లోనే తన సెంచరీని పూర్తి చేశాడు. ఈ విధ్వంసకర ఇన్నింగ్స్‌లో అభిషేక్ పాఠక్ కేవలం సిక్సర్ల ద్వారానే 90 పరుగులు పూర్తి చేశాడు. అభిషేక్ పాఠక్ భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌(Suryakumar Yadav)కు వీరాభిమాని కూడా కావడం గమనార్హం. అభిషేక్ సెంచరీ తర్వాత కూడా తన విధ్వంసకర ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు. అభిషేక్ పాఠక్ 48 బంతుల్లో 133 పరుగులు చేశాడు.

    Madhya Pradesh League | విధ్వంసం..

    ఈ ఇన్నింగ్స్‌లో అభిషేక్ 15 సిక్సర్లు, 7 ఫోర్లు కొట్టాడు. అంటే అభిషేక్ (Abhishek) సిక్సర్ల ద్వారా మాత్రమే 90 పరుగులు చేశాడు. రెండో ఓవర్లో 3 సిక్సర్లు కొట్టిన తర్వాత.. నాలుగో ఓవర్లో రితేష్ శాక్య బౌలింగ్‌లో అభిషేక్ వరుసగా 4 సిక్సర్లు కొట్టాడు. మ్యాచ్ అనంతరం అభిషేక్ మాట్లాడుతూ.. “నేను 13 ఏళ్ల వయస్సులో క్రికెట్ ఆడటం ప్రారంభించాను. నేను అండర్ 16, అండర్ 19, అండర్ 23లో మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)కు ప్రాతినిధ్యం వహించాను. ఐపీఎల్​లో ఆడగలనని నేను అనుకోను కానీ నాకు ఎక్కడ ఆడడానికి అవకాశం దొరికినా నేను బాగా ఆడడం, ఎక్కువ పరుగులు చేయడం గురించి మాత్రమే ఆలోచిస్తానని చెప్పాడు.

    సూర్యకుమార్ యాదవ్ (Suryakumar yadav) లాగా స్థిరత్వం నేర్చుకోవాలనుకుంటున్నానని అభిషేక్ పాఠక్ పేర్కొన్నాడు. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన బుందేల్‌ఖండ్ బుల్స్ 246 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా జబల్పూర్ రాయల్ లయన్స్ జట్టు 227 పరుగులకే కుప్పకూలింది. బుందేల్‌ఖండ్ ఈ మ్యాచ్‌ను 19 పరుగుల తేడాతో గెలుచుకుంది. ఇక ఆదివారం లీగ్ దశలో 2 చివరి మ్యాచ్‌లు ఉన్నాయి. రేపు అనగా జూన్ 23న మధ్యప్రదేశ్ లీగ్‌లో మొదటి, రెండో సెమీ-ఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. టైటిల్ మ్యాచ్ జూన్ 24న జరగనుంది. అన్ని మ్యాచ్‌లు గ్వాలియర్‌లోని శ్రీమంత్ మాధవరావు సింధియా క్రికెట్ స్టేడియంలో జరుగుతాయి.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. ఏ మార్గంలోనంటే..

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...