అక్షరటుడే, ఆర్మూర్: Abhigyan Malviya | ఆర్మూర్ సబ్ కలెక్టర్‌గా అభిగ్యాన్ మాల్వియా (Sub-Collector Abhigyan Malviya) మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆర్డీవో రాజాగౌడ్ (RDO Rajagoud) సబ్‌కలెక్టర్‌కు బాధ్యతలు స్వీకరించారు. ఆర్మూర్ సబ్‌డివిజన్‌లోని రెవెన్యూ శాఖ అధికారులు మర్యాదపూర్వకంగా కలుసుకుని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా సబ్ కలెక్టర్‌గా అభిగ్యాన్ మాల్వియా మాట్లాడుతూ రెవెన్యూ శాఖను ప్రజలకు మరింత చేరువ చేస్తానని పేర్కొన్నారు. ఆర్మూర్ రెవెన్యూ డివిజన్‌గా (Armoor Revenue Division) ఏర్పడిన నాటి నుంచి ఆర్డీవో స్థాయిలో రెవెన్యూ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
Abhigyan Malviya | 2023 బ్యాచ్ ఐఏఎస్..
రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులకు సబ్ కలెక్టర్లుగా పోస్టింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 2023 బ్యాచ్‌కు చెందిన అభిజ్ఞాన్ మాల్వియాను ఆర్మూర్ సబ్ కలెక్టర్‌గా నియమించింది. ఆర్మూర్ రెవెన్యూ కార్యకలాపాలు ఇకపై సబ్ కలెక్టర్ పర్యవేక్షణలో జరగనున్నాయి. కాగా ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో బోధన్ (Bodhan), బాన్సువాడకు (banswada) సబ్ కలెక్టర్లు ఉన్నారు.