అక్షరటుడే, ఆర్మూర్ : Abhigyan Malviya | ఆర్మూర్ సబ్ కలెక్టర్‌గా (Armoor Sub-Collector) అభిజ్ఞాన్ మాల్వియా నియమితులయ్యారు. ఆర్మూర్ రెవెన్యూ డివిజన్‌గా (Armoor Revenue Division) ఏర్పడిన నాటి నుంచి ఆర్డీవో స్థాయిలో రెవెన్యూ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
Abhigyan Malviya | 2023 బ్యాచ్ ఐఏఎస్..
రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులకు బుధవారం సబ్ కలెక్టర్లుగా పోస్టింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 2023 బ్యాచ్‌కు చెందిన అభిజ్ఞాన్ మాల్వియాను ఆర్మూర్ సబ్ కలెక్టర్‌గా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు (Chief Secretary to the Government Ramakrishna Rao)ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్మూర్ రెవెన్యూ కార్యకలాపాలు ఇకపై సబ్ కలెక్టర్ పర్యవేక్షణలో జరగనున్నాయి. కాగా ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో బోధన్ (Bodhan), బాన్సువాడకు (banswada) సబ్ కలెక్టర్లు ఉన్నారు.