అక్షరటుడే, వెబ్‌డెస్క్ : U-19 Asia Cup | అండర్ 19 ఆసియా కప్‌లో భారత్ దూకుడు కొనసాగుతోంది. మలేషియాతో (Malaysia) మంగళవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 315 పరుగుల తేడాతో విజయం సాధించింది.
అండర్-19 ఆసియా కప్‌లో (Under-19 Asia Cup) ఈ ఏడాది భారత్ భారీ స్కోర్లు చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా భారత ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) తన ధనాధన్ ఇన్నింగ్స్‌తో ఆదరగొడుతున్నారు. మరోవైపు మిగతా బ్యాటర్లు సైతం సత్తా చాటుతున్నారు. మంగళవారం దుబాయ్‌లో జరిగిన బ్యాచ్‌లో భారత్ మొదట బ్యాటింగ్ చేసింది. వైభవ్ సూర్యవంశీ 26 బంతుల్లో 50 పరుగులు చేసి ఔట్ అయ్యాడు.
U-19 Asia Cup | ఆకాశమే హద్దుగా..
ఐదో వికెట్‌గా వచ్చిన భారత కీపర్ అభిజ్ఞాన్ కుండు (Abhigyan Kundu) డబులు సెంచరీతో రాణించాడు. ఆకాశమే హద్దుగా మనోడు చెలరేగి ఆడాడు. 125 బంతుల్లో 209 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇందులో 17 ఫోర్లు, 9 సిక్సులు ఉన్నాయి. వేదాంత్ త్రివేది 90 పరుగులు చేశాడు. బ్యాటర్లు విజృంభించడంతో భారత్ నిర్ణిత 50 ఓవర్లలో 408 పరుగులు చేసింది.
U-19 Asia Cup | చతికిలపడిన మలేషియా
భారీ లక్ష్యం ఛేదనతో బ్యాటింగ్‌కు వచ్చిన మలేషియా చతికిల పడింది. ఒపెనర్లు ఇద్దరు డకౌట్ అయ్యారు. భారత బౌలర్లు చెలరేగడంతో మిడిలార్డర్ కూడా విఫలం అయింది. దీంతో 32.1 ఓవర్లలో ఆ జట్టు 93 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులో హంజా పగ్గి 35 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో దీపేశ్ దేవేంద్రన్ 5 వికెట్లు తీశాడు.