ePaper
More
    Homeలైఫ్​స్టైల్​Aashada Masam | ఆషాఢం.. నవ దంపతులకు ఎందుకీ ఎడబాటు

    Aashada Masam | ఆషాఢం.. నవ దంపతులకు ఎందుకీ ఎడబాటు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Aashada Masam | ఆషాఢ(Ashadam) మాసం వస్తోందంటే నవ దంపతుల్లో ఆందోళన నెలకొంటుంది. జీవిత భాగస్వామికి దూరంగా నెల రోజులు ఎలా గడపాలా అన్న చింతనతో చిక్కిపోతుంటారు. కొత్తగా పెళ్లయినవారు ఆషాఢ మాసంలో దూరంగా ఉండాలని పెద్దలు చెప్పడమే ఇందుకు కారణం. అయితే పెద్దలు ఏర్పాటు చేసిన ఈ ఆచారం వెనక నిగూడార్థాలున్నాయి. అవేమిటో తెలుసుకుందామా..

    Aashada Masam | శూన్యమాసం

    ఆషాఢాన్ని శూన్యమాసంగా పేర్కొంటారు. ఈ నెలలో శ్రీమహావిష్ణువు(Sri Maha Vishnu) యోగ నిద్రలోకి వెళతాడు కాబట్టి శుభకార్యాలు చేయరు. అంతకు రెండు నెలలు.. అంటే చైత్ర(Chaitra), వైశాఖ మాసాలలో ఎండలు మండుతుంటాయి. ఆ సమయంలో వ్యవసాయ పనులు ఉండవు కాబట్టి ఎక్కువగా వివాహాది శుభ ముహూర్తాలు ఉంటాయి. జూన్‌(June)లో వర్షాకాలం ప్రారంభమవుతుంది. ఈ నెలలోనే ఆషాఢం వస్తుంది. వ్యవసాయ(Agriculture) పనులన్నీ ఈ మాసంలోనే మొదలవుతాయి. అప్పుడే పెళ్లయిన జంట ఏకాంతాన్ని కోరుకుంటుంది. వారికి యుగమొక క్షణముగ గడిచిపోతుంటుంది. జీవిత భాగస్వామి దగ్గరలేని క్షణం యుగంలా కనిపిస్తుంటుంది.

    Aashada Masam | వ్యవసాయ పనుల కాలం..

    అయితే ఇది వ్యవసాయ పనుల కాలం.. ఇంటిళ్లిపాది పనిచేస్తేనే పనులు ముందుకు సాగుతాయి. కష్టపడి వ్యవసాయ పనులు చేయాల్సిన యువకులు ఇంట్లో కూర్చొని ఉంటే పనులకు ఆటంకం ఏర్పడే అవకాశాలుంటాయి. ఒకవేళ పనులకు వెళ్లినా ఇంటి ధ్యాసతో పనులు సరిగా చేయరు. అందుకే పెద్దలు తెలివిగా ఆషాఢంలో నవ దంపతులు ఒకచోట ఉండకుండా ఆచారాన్ని ఏర్పాటు చేశారు. ఆషాఢంలో అత్తాకోడళ్లు ఒకేచోట ఉండకూడదంటూ నవ వధువును పుట్టింటికి పంపించే సంప్రదాయాన్ని తీసుకువచ్చారు. అలాగే కొత్త అల్లుడు అత్తారింట అడుగుపెట్టకూడదన్న నియమం పెట్టారు.

    Aashada Masam | మరో కారణమూ ఉంది..

    ఇలా దూరంగా ఉంచడానికి మరో కారణమూ ఉంది. ఈ మాసంలో స్త్రీ నెల తప్పితే(Pregnancy) వేసవి కాలంలో ప్రసవించే(Delivery) అవకాశాలుంటాయి. ఆ సమయంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల బాలింతతోపాటు నవజాత శిశువు ఇబ్బందిపడతారన్న ఉద్దేశంతోనూ నూతన దంపతులను దూరంగా ఉంచే ప్రయత్నం చేస్తారు. అంతేకాక ఈ కాలంలో వర్షాలు కురిసి కొత్త నీరు చేరుతుంటుంది. ఆ నీరు తాగడం వల్ల అనారోగ్యం బారినపడే అవకాశాలుంటాయి. ఆషాఢంలో విరోచనాలు, జ్వరాలు సాధారణం.. ఈ సమయంలో స్త్రీలు గర్భం దాల్చితే ఇబ్బంది అన్న భావనతోనూ ఈ ఆచారాన్ని తీసుకువచ్చారు. కొత్త అల్లుడు అత్తగారింటి గడప తొక్కకూడదన్న సంప్రదాయం కూడా ఈ కారణంతోనే వచ్చింది. నెల రోజులపాటు కలిగే ఎడబాటు.. వారిలో విరహాన్ని పెంచడమే కాకుండా జీవితాంతం కలిసుండాలన్న భావనను కలిగిస్తుందన్నది దీని వెనక ఉద్దేశం.

    More like this

    Movements and Protests | రెండు దేశాలు.. రెండు ఉద్యమాలు.. ప్రభుత్వాలను కూల్చేసిన నిరసనలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Movements and Protests | రెండు దేశాల్లో రగిలిన రెండు ఉద్యమాలు అక్కడి ప్రభుత్వాలను...

    Kamareddy | ఊపిరితిత్తులలో ఇరుక్కున్న శనగ గింజ.. చికిత్స చేసి తొలగించిన వైద్యులు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | పట్టణంలోని శ్వాస చెస్ట్ అండ్ జనరల్ ఆస్పత్రిలో (Swasah Chest and General...

    Minister Nitin Gadkari | వరద సాయం అందించి కామారెడ్డిని ఆదుకోండి

    అక్షరటుడే, కామారెడ్డి: Minister Nitin Gadkari | భారీ వర్షాలు కామారెడ్డి నియోజకవర్గాన్ని (Kamareddy constituency) అతలాకుతలం చేశాయి....