అక్షరటుడే, వెబ్డెస్క్ : Aarogya Sri | ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఓ వైపు ప్రైవేట్ కాలేజీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. బకాయిలు చెల్లించకపోతే కాలేజీలు బంద్ చేస్తామని చెబుతున్నాయి. మరోవైపు ఆరోగ్య శ్రీ నెట్వర్క్ ఆస్పత్రులు(Aarogya Sri Network Hospitals) సైతం సేవలు బంద్ చేస్తామని ప్రకటించారు.
ఆరోగ్య శ్రీ బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడంతో మరోసారి సేవలను నిలిపివేయనున్నట్లు ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ (TANHA) తెలిపింది. ఈ మేరకు సోమవారం ప్రకటించింది. మంగళవారం (సెప్టెంబర్ 16) అర్ధరాత్రి నుంచి ఆరోగ్య శ్రీ సేవలు నిలిపి వేస్తామని పేర్కొంది.
Aarogya Sri | రూ.1300 కోట్ల బకాయిలు
ఆరోగ్య శ్రీ సేవలకు(Aarogya Sri Services) సంబంధించి నెట్వర్క్ ఆస్పత్రులకు ప్రభుత్వం రూ.1400 కోట్లు చెల్లించాల్సి ఉందని తానా తెలిపింది. ఈ బిల్లులు చెల్లించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని ఆస్పత్రుల యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. ఏడాదిగా ప్రభుత్వం నుంచి నిధులు రావడం లేదని తానా పేర్కొంది. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేసింది. పలుమార్లు ప్రభుత్వాన్ని కలిసి విన్నవించినా.. స్పందన లేకపోవడంతో సేవలు నిలిపి వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. నిధులు లేమితో ఆస్పత్రులు నడిపించే పరిస్థితి లేదని ప్రైవేట్ హాస్సిటల్స్ అసోసియేషన్ (Private Hospitals Association) పేర్కొంది.
Aarogya Sri | గతంలో హామీ ఇచ్చినా..
రాష్ట్రంలోని దాదాపు 400 ఆస్పత్రులకు బిల్లులు రావాల్సి ఉంది. బిల్లుల కోసం గతంలోనే తానా సేవలు నిలిపి వేస్తామని ప్రకటించింది. ఆగస్టు 31 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు ఆపేస్తామని ప్రకటించడంతో ప్రభుత్వం వారితో చర్చలు జరిపింది. బకాయిలు విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. అయితే ఇప్పటి వరకు నిధులు విడుదల చేయకపోవడంతో సమ్మె చేపట్టాని నిర్ణయించామని తానా తెలిపింది.