అక్షరటుడే, వెబ్‌డెస్క్ : AAP MLA | అత్యాచారం కేసులో అరెస్టు అయిన ఆప్ ఎమ్మెల్యే(AAP MLA) పోలీసులపై కాల్పుపు జరిపి, పరారయ్యాడు. ఈ ఘటన పంజాబ్‌లో మంగళవారం తీవ్ర కలకలం రేపింది. రెండు వాహనాల్లో పారిపోయిన ఎమ్మెల్యే, అతని అనుచరుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.
అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న సనూర్‌కు చెందిన ఆప్ ఎమ్మెల్యే హర్మీత్ పఠాన్‌మజ్రా(Harmeet Pathanmajra)ను పోలీసులు మంగళవారం కర్నాల్‌లో అరెస్టు చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్‌కు అతన్ని తీసుకెళ్తుండగా, పఠాన్‌మజ్రా, అతని అనుచరులు పోలీసు బృందం(Police Team)పై కాల్పులు జరిపారు. ఒక పోలీసు వారిని ఆపడానికి ప్రయత్నించినప్పుడు, వారు అతనిని ఢీకొట్టి రెండు వాహనాల్లో పారిపోయారు.తేరుకున్న పోలీసులు ఓ వాహనాన్ని అడ్డుకున్నప్పటికీ, ఎమ్మెల్యే మరో వాహనంలో పరారయ్యారు. పోలీసు బృందాలు అతడి వాహనాన్ని వెంబడించాయి.
AAP MLA | అనేక ఆరోపణలు..
ఎమ్మెల్యే పఠాన్‌మజ్రాపై అనేక ఆరోపణలున్నాయి. అత్యాచారం, మోసం, బెదిరింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలపే కేసులు నమోదయ్యాయి. విడాకులు తీసుకున్నానని అబద్ధం చెప్పి తనతో సంబంధం పెట్టుకున్నాడని ఒక మహిళ ఆరోపించింది. లైంగిక దోపిడీకి పాల్పడమే కాకుండా అశ్లీల సందేశాలు పంపిస్తూ బెదిరింపులుకు పాల్పడ్డాడని బాధితురాలు ఆరోపించింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు.
AAP MLA | ప్రభుత్వంపై గతంలో విమర్శలు
గతంలో, పంజాబ్(Punjab)లో వరదలు వచ్చిన సమయంలో ఆప్ ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే తీవ్రంగా విమర్శించారు. తనపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసిన తర్వాత ఆయన ఫేస్‌బుక్‌లో లైవ్‌లోకి వచ్చి, భగవంత్ మాన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలను గుప్పించారు. ఢిల్లీలోని ఆప్ నాయకత్వం పంజాబ్‌ను చట్టవిరుద్ధంగా పాలిస్తోందని ఆరోపించారు. వారు తనపై కేసులు పెట్టి జైలులో ఉంచగలరేమో తన గొంతు నొక్కలేరని స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని విమర్శించిన తర్వాత తనకు భద్రతను తగ్గించారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. “నేను నిన్న నా గన్ మెన్‌లను వెనక్కి పంపుతామని ఇప్పటికే చెప్పాను. ఢిల్లీ నాయకులు (ఆప్) విజిలెన్స్ (చర్య) లేదా ఎఫ్‌ఐఆర్‌లతో నన్ను భయపెట్టవచ్చని అనుకుంటున్నారు, కానీ నేను ఎప్పటికీ తలవంచను. నేను నా ప్రజలతో ఒక శిలలా నిలబడతాను” అని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మాట వినాలి, లేకపోతే వారు తరిమి కొడతారని పఠన్‌మజ్రా హెచ్చరించారు.