HomeUncategorizedLIC Jobs | ఎల్‌ఐసీలో ఏఏవో, ఏఈ పోస్టులు..

LIC Jobs | ఎల్‌ఐసీలో ఏఏవో, ఏఈ పోస్టులు..

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: LIC Jobs | పలు పోస్టుల భర్తీ కోసం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (LIC) రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. అసిస్టెంట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ (AAO), అసిస్టెంట్‌ ఇంజినీర్‌(AE) పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులనుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. నోటిఫికేషన్‌ (Notification) వివరాలిలా ఉన్నాయి.

భర్తీ చేసే పోస్టుల సంఖ్య : 491.
ఖాళీల వివరాలు :
1. అసిస్టెంట్‌ ఇంజినీర్‌ : 81 పోస్టులు. ఇందులో ఏఈ(సివిల్‌)- 50, ఏఈ(ఎలక్ట్రికల్‌)-31 పోస్టులున్నాయి.
2. అసిస్టెంట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ (Specialist) : 410 పోస్టులు. ఇందులో ఏఏవో(సీఏ) – 30, ఏఏవో(సీఎస్‌) – 10, ఏఏవో(ఆక్చ్వేరియల్‌) -30, ఏఏవో(ఇన్సూరెన్స్‌ స్పెషలిస్ట్‌) -310, ఏఏవో(లీగల్‌) -30 పోస్టులున్నాయి.

అర్హతలు : ఇంజినీరింగ్‌ పోస్టులకు ఆయా విభాగాలలో బీటెక్‌ లేదా బీఈ (B.E.) పూర్తి చేసినవారు అర్హులు. ఏఏవో పోస్టులకు ఏదైనా డిగ్రీ(Degree) పూర్తి చేసి ఉండాలి.
వయో పరిమితి : 21 నుంచి 30 ఏళ్లలోపువారు అర్హులు. రిజర్వేషన్ల ఆధారంగా వయో పరిమితలో సడలింపులు ఉంటాయి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, పీవోడబ్ల్యూడీ (POwD) అభ్యర్థులకు 10 నుంచి 15 ఏళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.
వేతనం : నెలకు రూ. 88,635 బేసిక్‌ వేతనం. మొత్తం అలవెన్సులు కలిపి రూ. 1.26 లక్షల వరకు అందుతుంది.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌ ద్వారా..

దరఖాస్తు రుసుము వివరాలు :
ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు రూ.85 దరఖాస్తు రుసుము (లావాదేవీ ఛార్జీలు ప్లస్‌ జీఎస్టీ అదనం) చెల్లించాలి.
జనరల్‌, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ అభ్యర్థులు రూ.700 దరఖాస్తు రుసుము(లావాదేవీ ఛార్జీలు ప్లస్‌ జీఎస్టీ అదనం) చెల్లించాల్సి ఉంటుంది.

దరఖాస్తుకు చివరి తేదీ : సెప్టెంబర్‌ 8.
ప్రిలిమ్స్‌ పరీక్ష అక్టోబర్‌ 03న, మెయిన్స్‌ పరీక్ష నవంబర్‌ 08న నిర్వహిస్తారు.

పూర్తి వివరాల కోసం ఎల్‌ఐసీ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌ https://www.licindia.in/ ను సందర్శించండి.