ePaper
More
    HomeసినిమాMeghalaya Murder Case | మేఘాల‌య హ‌నీమూన్ హ‌త్య కేసుపై సినిమా.. ఏకంగా బ‌డా హీరోనే...

    Meghalaya Murder Case | మేఘాల‌య హ‌నీమూన్ హ‌త్య కేసుపై సినిమా.. ఏకంగా బ‌డా హీరోనే ప్లాన్ చేశాడుగా..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Meghalaya Murder Case | మేఘాలయ హనీమూన్ హత్య కేసు ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విష‌యం తెలిసిందే. ఇది సాధారణ క్రైమ్ కేసులా కాకుండా, దీనిలో చోటు చేసుకున్న ఘట్టాలు, ట్విస్టులు, మిస్టరీలు ప్రజల్లో తీవ్ర చర్చ జరిగింది. ఇప్పుడు ఈ కేసు ఆధారంగా ఓ వాస్తవిక క్రైమ్ థ్రిల్లర్‌ (Crime Thriller) తెరపైకి రాబోతోందనే వార్తలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

    ఈ ప్రాజెక్ట్‌ను బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్‌ ఆమిర్ ఖాన్ స్వయంగా పట్టాలెక్కించనున్నట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. విభిన్నమైన కథలు, సున్నితమైన విషయాలను తన సినిమాల్లో చూపించే ఆమిర్, ఈ కేసులోని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ (Thrilling Elements), భావోద్వేగ మలుపులు ఇలా అన్ని కోణాలనూ గమనించి కథగా మలచాలని అనుకుంటున్నాడ‌ని నెట్టింట జోరుగా ప్ర‌చారం న‌డిచింది.

    Meghalaya Murder Case | త‌ప్పుడు ప్ర‌చారాలు..

    అయితే ఈ వార్తలన్నీ అవాస్తవాలను ఆమిర్ ఖాన్ (Aamir Khan) తన టీమ్ ద్వారా స్పష్టం చేయ‌డంతో పుకార్ల‌కు పుల్​స్టాప్ ప‌డింది. మేఘాలయ హత్య కేసు ఆధారంగా తాను ఎటువంటి సినిమాను తెర‌కెక్కించ‌డం లేద‌ని ఆమిర్ స్ప‌ష్టం చేశారు. మేఘాల‌య హ‌త్య కేసు విష‌యానికి వ‌స్తే.. రాజా రఘువంశీ అనే వ్యక్తి తన భార్య సోనమ్‌తో కలిసి హనీమూన్‌ ట్రిప్‌కి వెళ్లి అక్కడ అనుమానాస్పద పరిస్థితుల్లో మరణిస్తాడు. అనంతరం మర్డర్ వెనుక అతని భార్య పాత్రపై అనేక అనుమానాలు తలెత్తుతాయి. చివ‌రికి వివాహేత‌ర సంబంధం వ‌ల‌న అతని భార్య‌నే చంపించింద‌ని ఇన్వెస్టిగేష‌న్‌లో తేలుతుంది. ఈ కేసు దేశ వ్యాప్తంగా ప్ర‌కంప‌న‌లు పుట్టించింది.

    గతంలో ఆమిర్ ఖాన్ ‘తలాష్’ వంటి సైకాలజికల్ క్రైమ్ థ్రిల్లర్‌లో నటించి విమర్శకుల ప్రశంసలు పొందాడు. ఈ క్ర‌మంలో మళ్లీ వాస్తవ సంఘటనల ఆధారంగా మరో మిస్టరీ థ్రిల్లర్ చేస్తాడ‌ని అనుకున్నా, అవ‌న్నీ అవాస్త‌వాలు అని తేలింది. సితారే జమీన్ పర్ విజయం తర్వాత బాలీవుడ్ మిస్ట‌ర్ ఫ‌ర్‌ఫెక్ట్‌ ఆమిర్ ఖాన్ తన తదుపరి ప్రాజెక్ట్‌గా మ‌హాభార‌తం చేయ‌నున్నాడ‌ని అంటున్నారు. ప్రస్తుతం తన నిర్మాణ సంస్థలో పలు ప్రాజెక్ట్​లు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇప్ప‌టికే త‌న కొడుకుతో ఎక్‌దిన్ అనే చిత్రాన్ని నిర్మిస్తున్న ఆమిర్ త‌మిళ ద‌ర్శ‌కుడు లోకేష్ కనగరాజ్‌తో కలిసి ఒక సూపర్ హీరో సినిమా చేయనున్న‌ట్టు తెలుస్తుంది. 2026 ద్వితీయార్థంలో ఈ మూవీ షూటింగ్ ప్రారంభించ‌నున్నాడు.

    More like this

    Thar SUV | నిమ్మకాయని తొక్కించ‌బోయి ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడిన కొత్త‌ కారు .. ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ యువ‌తి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Thar SUV | కొత్త కారు కొనుగోలు చేసిన ఆనందం క్షణాల్లోనే భయానక అనుభవంగా...

    IPO | ఐపీవోకు మంగళ సూత్రాల తయారీ కంపెనీ.. నేడు సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : IPO | మంగళసూత్రాలు తయారు చేసే శ్రింగార్‌ హౌస్‌ ఆఫ్‌ మంగళసూత్ర ఐపీవోకు వచ్చింది....

    Terrorists Arrest | ఐసిస్ ఉగ్ర‌వాదుల‌ అరెస్టు.. రాంచీ, ఢిల్లీలో ప‌ట్టుబ‌డిన నిందితులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Terrorists Arrest | ఉగ్ర‌వాద నిరోధ‌క చ‌ర్య‌ల్లో భ‌ద్ర‌తా ద‌ళాలు కీల‌క విజ‌యం సాధించాయి....