HomeUncategorizedAamir khan | ‘సీతారే జమీన్ పర్‌’లో అమీర్ ఖాన్ త‌ల్లి గెస్ట్ అప్పియ‌రెన్స్.. సోదరి...

Aamir khan | ‘సీతారే జమీన్ పర్‌’లో అమీర్ ఖాన్ త‌ల్లి గెస్ట్ అప్పియ‌రెన్స్.. సోదరి కూడా..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Aamir khan | లాల్ సింగ్ చ‌ద్దా త‌ర్వాత అమీర్ ఖాన్ Aamir khan కాస్త గ్యాప్ తీసుకుని ఇప్పుడు సితారే జ‌మీన్ ప‌ర్(Sitare Zameen Par) సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. జూన్ 20న సితారే జ‌మీన్ ప‌ర్ ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా ఈ సినిమా ప్ర‌మోష‌న్స్​లో చాలా యాక్టివ్ గా పాల్గొంటున్నాడు అమీర్ ఖాన్. ఈ క్ర‌మంలో అనేక ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకుంటున్నాడు. ఇందులో ప్రేక్ష‌కుల‌కు స‌ర్‌ప్రైజ్‌లు చాలానే ఉండ‌నున్నాయ‌ని అమీర్ అన్నాడు. అమీర్‌ ఖాన్ తల్లి జీనత్ ఖాన్ ఈ సినిమాతో తొలిసారి వెండితెరపై కనిపించనున్నారు. అంతే కాదు, ఆయన సోదరి నిఖత్ ఖాన్ కూడా సినిమాలో కనిపించబోతున్నారు.

Aamir khan | నిజంగా అద్భుతమే..

ఇటీవల ముంబై(Mumbai)లో జరిగిన ఒక మీడియా సమావేశంలో అమీర్​ఖాన్​ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. “సాధారణంగా అమ్మ ఎప్పుడూ షూటింగ్‌కు రావాలనుకోదు. కానీ ఆ రోజు ఉదయం నాకు కాల్ చేసి అడిగింది.. ‘మీరు ఎక్కడ షూటింగ్ చేస్తున్నారు? నాకూ రావాలనిపిస్తోంది అని. నేను రండి అని వెంటనే కార్ పంపించాను. నా చెల్లి ఆమెను తీసుకొచ్చింది. ఆమె వీల్‌చైర్‌లో వచ్చింది అని అమీర్​ భావోద్వేగంగా చెప్పారు. అయితే ఆ రోజు ఒక పెళ్లి పాట కోసం షూటింగ్ జరుగుతుండగా, అమీర్​ తల్లి (Mother) అది చూసి హ్యాపీగా ఫీలైంది. అదే సమయంలో దర్శకుడు ప్రసన్న నా దగ్గరకు వచ్చి, “సర్, మీరు ఓకే అనుకుంటే అమ్మని ఒక షాట్‌లో పెడ‌దామా అని అడిగాడు. ఇది చివరి పాట, నాకు ఇది ఎమోషనల్‌గా చాలా ముఖ్యమైన విషయం అని అన్నాడు. వెంట‌నే దానికి అమీర్​ ఓకే చెప్పాడ‌ట‌.

అమీర్​ తల్లి జీనత్ ఖాన్(Zeenat Khan) నటనలో శిక్షణ తీసుకోలేదు, ఆమె మొదటిసారిగా కెమెరా ముందుకు వ‌చ్చారు. ఇది కేవలం నటనా ప‌రంగానే కాకుండా ఒక భావోద్వేగపు పరిణామం కూడా. ఒక తల్లి తన కొడుకుతో తెరపై భాగమవ్వడం, జీవితానుభవంగా ఉంటుంది. ఇక ఇందులో నిఖత్ ఖాన్ కూడా న‌టించింది. అమీర్​ సోదరి నిఖత్ ఖాన్ ఇప్పటికే పలు చిత్రాల్లో నటించిన అనుభవం ఉంది.. (Sitaare Zameen Par)ఈ సినిమాలో ఆమె కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించనుంది. తల్లీ-కొడుకుతో పాటు చెల్లెలు కూడా ఉండటం ఆ సన్నివేశాన్ని మ‌రింత హృద్యంగా మార్చ‌నుంది.