Credit Card | ఆధార్​ అప్​డేట్​.. క్రెడిట్​కార్డు రూల్స్.. జూన్​లో మార్పులివే..

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Credit Card | ఆర్థిక అంశాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. అవేంటో తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. మనం జూన్ నెలలో ప్రవేశించాం. ఈ నెలలో కొన్ని బ్యాంకులు క్రెడిట్ కార్డు రివార్డు పాయింట్లకు సంబంధించిన మార్పులు చేశాయి. ఎఫ్ఏ వడ్డీ రేట్లను సవరించాయి. ఈపీఎస్ఓలోనూ మార్పులు వచ్చాయి. ఆధార్ ఉచిత అప్​డేట్​ గడువు కూడా ఈ నెలలోనే ముగియనుంది. ఇంకా ఏంటంటే.. ఫిక్స్​డ్ డిపాజిట్స్(Fixed Deposits).. ఆర్బీఐ(RBI) రెపోరేటు(repo rate)ను తగ్గించడం వల్ల హెచ్ఎఫ్సీ, […]

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Credit Card | ఆర్థిక అంశాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. అవేంటో తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. మనం జూన్ నెలలో ప్రవేశించాం. ఈ నెలలో కొన్ని బ్యాంకులు క్రెడిట్ కార్డు రివార్డు పాయింట్లకు సంబంధించిన మార్పులు చేశాయి. ఎఫ్ఏ వడ్డీ రేట్లను సవరించాయి. ఈపీఎస్ఓలోనూ మార్పులు వచ్చాయి. ఆధార్ ఉచిత అప్​డేట్​ గడువు కూడా ఈ నెలలోనే ముగియనుంది. ఇంకా ఏంటంటే..

ఫిక్స్​డ్ డిపాజిట్స్(Fixed Deposits)..

ఆర్బీఐ(RBI) రెపోరేటు(repo rate)ను తగ్గించడం వల్ల హెచ్ఎఫ్సీ, ఐసీఐసీఐ, యాక్సిస్ వంటి బ్యాంకులు డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించాయి. సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎఫీలపై వడ్డీ రేట్లను జూన్ 1 నుంచి తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఇతర బ్యాంకులు కూడా వడ్డీ సవరించే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఈపీఎఫ్ 3.0(EPF 3.0)..

ఉద్యోగ భవిష్య నిధి సంస్థ కీలక అప్​గ్రేడ్​కు సన్నద్ధమైంది. జూన్ నెలలో 3.0కు అప్​గ్రేడ్​ అవుతోంది. దీనివల్ల యూపీఐ, ఏటీఎం నుంచి నగదు విత్​డ్రా సదుపాయం అందుబాటులోకి రానుంది. క్లెయిమ్ ప్రక్రియ సైతం వేగవంతం కానుంది.

సెబీ కటాఫ్ రూల్(SEBI Cutoff Rule)..

ఓవర్​నైట్​ ఫండ్​కు సంబంధించి కటాఫ్ సమయంలో సెబీ మార్పులు చేసింది. నేటి(జూన్ 1) నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రాబోతున్నాయి. ఆఫ్​లైన్​ లావాదేవీలకు సంబంధించి మధ్యాహ్నం 3 వరకు వచ్చిన పెట్టుబడి అభ్యర్థనలకు అదే రోజు ముగింపు ఎన్ఏవీ వర్తించనుంది. తర్వాత వచ్చిన దరఖాస్తులకు మరుసటి వ్యాపార దినం ఎన్ఏవీ ప్రకారం యూనిట్లు కేటాయిస్తారు. ఆన్​లైన్​ విధానంలో దరఖాస్తులను సాయంత్రం 7 గంటల వరకు అనుమతించనున్నారు.

క్రెడిట్ కార్డు మార్పులు(Credit card changes) ఇలా..

కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎంపిక చేసిన కొన్ని క్రెడిట్ కార్డు రివార్డు పాయింట్లలో కోతను పెట్టింది. నేటి(జూన్ 1) నుంచి ఈ మార్పులు అమల్లోకి వచ్చింది. యుటిలిటీస్, ఎడ్యుకేషన్, వాలెట్, ఫ్యూయల్, రెంట్ పేమెంట్, గవర్నమెంట్ చెల్లింపులు, ఇన్సూరెన్స్, ఆన్​లైన్​ గేమింగ్ వంటి విషయాల్లో కొన్నింటికి పూర్తిగా రివార్డు ప్రయోజనాలను నిలిపివేస్తున్నాయి. మరికొన్నింటికి పరిమితి విధిస్తున్నాయి.

యాక్సిస్ బ్యాంక్ సైతం యుటిలిటీ, రెంట్, టెలీకాం, ఫ్యూయల్, ఇన్సూరెన్స్, వాలెట్, ఎడ్యుకేషన్ వంటి లావాదేవీలపై జూన్ 20 నుంచి రివార్డు ప్రయోజనాలను నిలిపివేయనుంది. రెంట్, వాలెట్ టాప్-అప్స్​ను వార్షిక ఫీజు మినహాయింపు పరిమితి నుంచి తప్పించనుంది.

హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్.. టాటా న్యూ ఇన్ఫినిటీ క్రెడిట్ కార్డు హోల్డర్లకు లాంజ్ యాక్సెస్ సదుపాయంలో మార్పులు తీసుకొచ్చింది. ఒక త్రైమాసికంలో రూ.50 వేలు మించి కొనుగోలు చేసిన వారికే లాంజ్ యాక్సెస్ అందించనుంది. జూన్ 10 నుంచి ఈ మార్పు అమల్లోకి రానుంది.

వడ్డీ రేట్ల(Interest rate) ఊరట..

ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ జూన్ 4, 5, 6 తేదీల్లో సమావేశం కాబోతోంది. ఆరో తేదీన నిర్ణయాలు వెలువడనున్నాయి. గత రెండు సమావేశాల్లో రెపో రేటును ఆర్బీఐ తగ్గించిన విషయం తెలిసిందే. మరోసారి సైతం ఊరట లభిస్తే.. గృహ, వాహన రుణ వినియోగదారులకు ప్రయోజనం చేకూరనుంది.

ఆధార్ అప్​డేట్(Aadhaar update)​..

ఆధార్ వివరాలను ఉచితంగా అప్​డేట్​ చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గడువు జూన్ 14తో ముగియబోతోంది. ప్రతి పదేళ్లకోసారి ఆధార్​ వివరాలను అప్​డేట్​ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం సంబంధిత రుజువు పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ‘మై ఆధార్ పోర్టల్ ద్వారా మాత్రమే ఉచిత సేవలు అందుబాటులో ఉంటాయి. ఉచిత గడువు ముగిశాక గతంలో మాదిరిగా ఆధార్ కేంద్రాల్లో రూ.50 చెల్లించి అప్​డేట్​ చేసుకోవాల్సి ఉంటుంది.

ఎల్పీజీ సిలిండర్(LPG cylinder)..

అంతర్జాతీయ మార్కెట్​కు అనుగుణంగా చమురు సంస్థలు దేశీయంగా ఎల్పీజీ సిలిండర్ ధరలను సవరిస్తుంటాయి. మేలో కమర్షియల్ సిలిండర్ ధర తగ్గింది. ఈసారి కూడా మార్పులుండొచ్చు.

Naresh Chandan
Naresh Chandan
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

GeoSpy AI | లొకేషన్‌తో పనిలేకుండా ఫొటో అడ్రస్ పట్టేస్తుంది

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: GeoSpy AI | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence - AI) వినియోగం పెరిగాక ప్రతి విషయం తెలుసుకోవడంలో స్పష్టత మరింత...

TGSRTC app ticket booking | ప్రయాణికులకు గుడ్​న్యూస్​.. యాప్​లో ఆర్టీసీ బస్సు టికెట్లు బుక్​ చేసుకోవచ్చు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : TGSRTC app ticket booking | ఆర్టీసీ బస్సుల్లో యాప్​ ద్వారా టికెట్లు బుక్​ చేసుకునే విధానాన్ని ప్రభుత్వం ప్రవేశ...

HYDRAA land protection | రూ.100 కోట్ల పార్కు స్థలాన్ని కాపాడిన హైడ్రా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA land protection | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతంది. వందల కోట్ల విలువైన ప్రభుత్వ,...

Congress Warning to Rakesh | రాకేష్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకో..: కాంగ్రెస్ నాయకుల హెచ్చరిక

ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు.