అక్షరటుడే, ఇందూరు : Aadhaar Services in Post Offices | ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కొన్ని గుర్తించబడిన పోస్టాఫీస్‌లలో ఆధార్ సేవలు అందిస్తున్నామని తపాలాశాఖ సీనియర్ సూపరింటెండెంట్ జనార్దన్ రెడ్డి (Superintendent Janardhan Reddy) తెలిపారు. ఈ మేరకు సోమవార ఓ ప్రకటన విడుదల చేశారు.
Aadhaar Services in Post Offices | ఎంపిక చేసిన పోస్టాఫీస్‌లలో..
ఉమ్మడిజిల్లాలో ఎంపిక చేసిన పోస్ట్ ఆఫీసుల్లో ఆధార్ నమోదు, మార్పులు, చేర్పులు చేయబడతాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు ఆధార్ నమోదు చేసుకోని వారు, ఆధార్‌లోని పేరు, పుట్టిన తేదీ, చిరునామా, మొబైల్ నంబర్, ఫొటో, బయోమెట్రిక్స్ (వేలు ముద్రలు) వంటి వివరాలలో మార్పులు అవసరమైన వారు పోస్టాఫీస్ పనిదినాల్లో సంప్రదించవచ్చన్నారు.
ఈ పోస్టాఫీసుల్లోనే..
ఆర్మూర్, నిజామాబాద్ (Nizamabad), కామారెడ్డి హెడ్ పోస్ట్ఆఫీసులు (Kamareddy Head Post Offices), వేల్పూర్, నిజామాబాద్ ఆర్ఎస్, సుభాష్ నగర్, బాన్సువాడ, బోధన్, మద్నూర్, శక్కర్ నగర్, డిచ్పల్లి, నవీపేట్ సబ్ పోస్టాఫీస్‌లలో ఈ సౌకర్యం అందుబాటులో ఉందని జనార్దన్ రెడ్డి తెలిపారు. ప్రజలు ఆధార్‌లో మార్పులు చేర్పులు, కొత్త ఆధార్ కోసం నిబంధలన ప్రకారం ఆధారాలు చూపించాల్సి ఉంటుందన్నారు.