ePaper
More
    Homeటెక్నాలజీItel A90 | భార‌త మార్కెట్‌లో అదిరిపోయే ఫీచ‌ర్స్‌తో కొత్త ఫోన్.. రూ.7వేల లోపే!

    Itel A90 | భార‌త మార్కెట్‌లో అదిరిపోయే ఫీచ‌ర్స్‌తో కొత్త ఫోన్.. రూ.7వేల లోపే!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Itel A90 | వినియోగదారులు ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త ఫోన్స్ వాడేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఈ క్ర‌మంలోనే ర‌క‌ర‌కాల ఫోన్స్ మార్కెట్‌లోకి లాంచ్ అవుతున్నాయి. తాజాగా భారత మార్కెట్​లో ‘ఐటెల్ A90’ లాంఛ్ అయింది. ఈ ఫోన్‌లో కంపెనీ 4GB ర్యామ్‌తో 64GB, 128GB స్టోరేజ్ ఆప్షన్స్ కూడా ఇవ్వ‌డం విశేషం. ఫోన్‌లోని ప్రాసెసర్ కోసం Unisoc T7100 చిప్‌సెట్ అమర్చింది. దీన్ని రూ.7,000 కంటే తక్కువ ధరకే లాంఛ్ చేసింది. ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్​లో వినియోగదారులకు 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీ, 13MP మెయిన్ కెమెరా లభిస్తాయి. ఈ ఫోన్ స్క్రీన్‌పై డైనమిక్ బార్ ఫీచర్ కూడా ఉంది.

    Itel A90 | ఓ సారి ట్రై చేయండి..

    దీని ద్వారా బ్యాటరీ ఛార్జింగ్, ఇన్ కమింగ్ కాల్స్, మ్యూజిక్ ప్లేబ్యాక్ వంటి ముఖ్యమైన సమాచారాన్ని డిస్‌ప్లేలో చూసే అవ‌కాశం ఉంటుంది. మ‌రోవైపు నోటిఫికేషన్‌లు(Notifications), అలర్ట్స్​ను ఒకే చోట అందించడంలో సహాయపడుతుంది. ఇక ఈ ఫోన్ ఫీచ‌ర్స్ విష‌యానికి వ‌స్తే.. డిస్​ప్లే: ఇది ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే సపోర్ట్‌తో 90Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ప్రాసెసర్ కోసం ఆక్టా-కోర్ యూనిసోక్ T7100 SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఇది 4GB RAMతో వస్తుంది. ఈ ఫోన్‌లో 8GB వరకు వర్చువల్ RAM సపోర్ట్ కూడా ఉంది. ఫోన్ 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 15W ఫాస్ట్ ఛార్జింగ్​కు సపోర్ట్‌ చేస్తుంది. అయితే కంపెనీ ఈ ఫోన్ బాక్స్‌లో 10W ఫాస్ట్ ఛార్జర్ మాత్రమే అందిస్తుంది.

    ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 గో ఎడిషన్ ఆధారంగా ఐటెల్ OS 14పై నడుస్తుంది. ఈ ఫోన్ 36 నెలల పాటు ఎటువంటి లాగింగ్ ఇష్యూ ఉండదని కంపెనీ పేర్కొంది. ఐవానా 2.0 అనే స్మార్ట్ AI అసిస్టెంట్ ఫీచర్‌ను కూడా కలిగి ఉంది. ఇది డాక్యుమెంట్స్​ను ట్రాన్స్​లేట్ చేయడం, లోకల్ గ్యాలరీ నుంచి ఇమేజ్​లను ఎక్స్​ప్లెయిన్​ చేయడం, వాట్సాప్ వాయిస్ అండ్ వీడియో కాల్స్​, మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్​ను పరిష్కరించడం వంటి పనులను చేస్తుంద‌ట‌. అలానే DTS సౌండ్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది. ఫోన్ వెనుక భాగంలో 13MP కెమెరా ఉంది. అదే సమయంలో 8MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఫోన్ డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెంట్ కోసం IP54 రేటింగ్​ను కలిగి ఉంది. 4GB RAM + 64GB స్టోరేజ్ ధర: రూ. 6,499గా ఉండ‌గా, 4GB RAM + 128GB స్టోరేజ్ ధర: రూ. 6,999 గా ఉంది.

    More like this

    Kukatpally murder case | కాళ్లూచేతులు కట్టేసి.. కుక్కర్​తో తలపై బాది.. గొంతు కోసి.. కూకట్​పల్లిలో మహిళ దారుణ హత్య

    అక్షరటుడే, హైదరాబాద్: Kukatpally murder case : నమ్మకంగా ఉంటారనుకున్న ఇంట్లో పనివాళ్లే దారుణానికి ఒడిగట్టారు. ఇంటి యజమానురాలిని...

    Rain Alert | రాష్ట్రానికి నేడు భారీ వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rain Alert | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గురువారం భారీ వర్షం (Heavy Rain)...

    Dichpalli | సీనియర్​ జర్నలిస్ట్ నారాయణ​ మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Dichpalli | సీనియర్​ జర్నలిస్ట్​ నారాయణ మృతి చెందారు. ఆంధ్రజ్యోతి డిచ్​పల్లి రిపోర్టర్​గా పని...