అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Rahul Gandhi | కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత (LOP) రాహుల్‌గాంధీ (Rahul Gandhi)కి ఓ యువకుడు ముద్దు పెట్టాడు. ఆయన బీహార్ (Bihar)లో ఓటర్ అధికార్ యాత్ర (Voter Adhikar Yatra) చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ యాత్రలో భాగంగా బైక్‌పై వెళ్తున్న రాహుల్ గాంధీ వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చిన ఓ యువకుడు ముద్దు పెట్టాడు.
రాహుల్ గాంధీకి అకస్మాత్తుగా వచ్చి ముద్దు పెట్టడంతో భద్రతా సిబ్బంది షాక్ అయ్యారు. వెంటనే సదరు యువకుడిని పట్టుకొని చితకబాదారు. అయితే రాహుల్ గాంధీ మాత్రం బైక్‌ను ఆపకుండా యాత్రను అలాగే కొనసాగించారు. ఈ ఘటన ఆదివారం బీహార్‌లోని పుర్ణియా జిల్లాలో చోటు చేసుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే యువకుడు అలా ఎందుకు చేశాడనేది తెలియరాలేదు. రాహుల్‌పై అభిమానంతోనే ముద్దు పెట్టి ఉంటాడని సమాచారం. అయితే అనుకొని ఘటనతో షాక్ అయిన సిబ్బంది సదరు యువకుడిని కొట్టారు.
Rahul Gandhi | రాహుల్ యాత్రకు స్పందన
బీహార్‌లో ఓటరు జాబితా సవరణ (SIR)ను వ్యతిరేకిస్తూ రాహుల్ గాంధీ ఓటర్ అధికార్ యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. ఈ యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఆగస్టు 16న ప్రారంభమైన ఈ యాత్ర సెప్టెంబర్ 1న ముగియనుంది. సెప్టెంబర్ 1న పాట్నా భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. బీహార్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఇండియా కూటమి భావిస్తోంది. ఈ క్రమంలో తీవ్రంగా కసరత్తు చేస్తోంది. రాహుల్ యాత్రకు మంచి స్పందన వస్తుండడంతో కూటమి నేతలు ఖుషి అవుతున్నారు.
Rahul Gandhi | ఎన్నికల సంఘంపై విమర్శలు
రాహుల్‌గాంధీ, ఇండియా కూటమి (INDI Alliance) నేతలు ఇటీవల ఎన్నికల సంఘంపై తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. బీహార్‌లో లక్షలాది మంది ఓట్లు తొలగించారని రాహల్ గాంధీ ఆరోపించారు. ఈ క్రమంలోనే ఆయన ఓటు అధికార్ యాత్ర చేపట్టారు. అయితే రాహుల్ గాంధీ ఆరోపణలను ఈసీ (EC) తోసిపుచ్చింది. ఆయన చేసిన ఆరోపణలపై అఫిడవిట్ ఇవ్వాలని.. లేకుంటే క్షమాపణలు చెప్పాలంటూ రాహుల్ గాంధీకి ఎన్నికల సంఘం సూచించింది.
RG ko kiss kr liya ek ladke ne security wale ne thappad de diya😂 pic.twitter.com/Kmm2JUIsBQ
— Parinda🕊 (@Parthian_1) August 24, 2025