అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | మూడు రోజుల క్రితం గడ్డిమందు తాగిన ఓ యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటన రామారెడ్డి (Ramareddy) మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పోగుల నాగరాజు (31) ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యాడు.
మనస్థాపంతో మూడు రోజుల క్రితం ఇంట్లో ఉన్న గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతడిని వెంటనే జిల్లా ఆస్పత్రికి (Kamareddy district hospital) తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న నాగరాజు బుధవారం మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.