240
అక్షరటుడే, భిక్కనూరు: Bhiknoor Mandal | భిక్కనూర్ మండలంలోని మోటాట్పల్లి గ్రామం (Motatpally Village)లో శనివారం తెల్లవారుజామున దారుణ హత్య జరిగింది.
గ్రామానికి చెందిన ఎర్ర రాజు (32) అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు గ్రామపంచాయతీ కార్యాలయ (Panchayat Office)వెనుకాల గొడ్డలితో నరికి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుడి తండ్రి నర్సయ్య, సోదరుడు శివకుమారులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.