అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | మద్యం మత్తులో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. నిజామాబాద్ నగరంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. వన్‌టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి (Traffic ACP Mastan Ali) తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని సాయిరెడ్డి పెట్రోల్ పంప్ (Sai Reddy Petrol Pump) సమీపంలోని ఓ పాన్‌షాప్ వద్ద ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో అక్కడే విధుల్లో ఉన్న కానిస్టేబుల్ అబ్బులు ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు రోడ్డుపై వాహనాలను తొలగించాలని కోరారు. ఇదే క్రమంలో ఓ ఆటోను సైతం రోడ్డుపై నుంచి తొలగించాలని చెప్పగా.. సదరు ఆటోడ్రైవర్ ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై తిరగబడ్డాడు. బెదిరింపులకు దిగాడు.
Nizamabad City | కత్తి చూపిస్తూ..
నన్ను ఆటో తీయాలని చెబుతావా అంటూ తన వద్ద ఉన్న కత్తిని చూపిస్తూ కానిస్టేబుల్‌ను బెదిరించాడు. వెంటనే ట్రాఫిక్ కానిస్టేబుల్ కత్తిని స్వాధీనం చేసుకుని.. అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఆటోను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ట్రాఫిక్ పోలీసుల ఫిర్యాదు మేరకు సదరు యువకుడిపై సిటీ పోలీస్ యాక్ట్ కింద ఆటోడ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్ ఎస్‌హెచ్‌వో పేర్కొన్నారు.