అక్షరటుడే, వెబ్డెస్క్ : Nalgonda Incident | నల్గొండ జిల్లా నాంపల్లి మండలం (Nampally Mandal) కేతపల్లిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ తన ప్రియుడి భార్యపై పెట్రోల్ పోసి నిప్పు అంటించింది. దీంతో ఆమె మృతి చెందింది.
కేతపల్లి గ్రామానికి (Kethapalli Village) చెందిన మీసాల సుజాతతో నగేష్ యాదవ్ అనే వ్యక్తికి వివాహేతర సంబంధం ఉంది. సుజాతకు అప్పటికే పెళ్లి కాగా.. ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. నగేశ్ యాదవ్కు భార్య మమత ఉంది. అయితే వారి మధ్య ఇటీవల గొడవలు జరుగుతున్నాయి. తన ఇద్దరి కుమార్తెలలో ఒకరిని పెళ్లి చేసుకోవాలని సుజాత ఒత్తిడి చేయగా నగేష్ అంగీకరించలేదని తెలుస్తోంది. ఈ క్రమంలో కోపంతో నగేష్ ఇంటికి వెళ్లి అతడి భార్య మమతపై పెట్రోల్ పోసి సుజాత నిప్పు అంటించింది. దీంతో మమత అక్కడికక్కేమే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Nalgonda Incident | వరుస ఘటనలతో ఆందోళన
దేశవ్యాప్తంగా వివాహేతర సంబంధాల (Extramarital Affairs) కోసం చేస్తున్న హత్యలు ఇటీవల పెరిగాయి. ప్రియుడి కోసం భర్తను హత్య చేస్తున్న మహిళలు.. ప్రేయసి మోజులో కట్టుకున్న భార్యను చంపేస్తున్న భర్తలు ఉన్నారు. తాత్కాలిక బంధాల కోసం ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడటం లేదు. ప్రేమ, వివాహేతర బంధాలతో ఇటీవల హత్యలు పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అంతేగాకుండా వీటి మోజులో పగతో ఇతరులపై సైతం దాడులు చేస్తుండటం గమనార్హం. ఇటీవల ఓ యువతి తన ప్రేమకు అడ్డుగా ఉన్నారని తల్లిదండ్రులను హత్య చేసింది. ఇటీవల ఏపీలో ఓ మహిళ ప్రియుడి కుటుంబం ఉంటున్న ఇంటికి నిప్పు పెట్టింది. వివాహేతర సంబంధం విషయంలో ఈ దారుణానికి పాల్పడగా.. ఆ కుటుంబం త్రుటిలో ప్రాణాలతో బయట పడింది. ఓ డాక్టర్ భార్యకు
ఆయన మాజీ ప్రేయసి ఇటీవల వైరస్ ఇంజెక్షన్ ఇచ్చింది.