319
అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad | తెల్లవారు జామున ఇంటి ముందు ముగ్గు వేస్తున్న మహిళ మెడలో నుంచి దుండగులు చైన్ లాక్కుని పారిపోయారు. ఈ ఘటన నిజామాబాద్ (Nizamabad) నగరంలోని నాలుగో టౌన్ పరిధిలో బుధవారం ఉదయం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. నగరంలోని వినాయక్‌నగర్ (Vinayaknagar) ప్రాంతంలో బుధవారం తెల్లవారు జామున స్వరూప అనే మహిళ ఇంటి ముందు ముగ్గు వేస్తోంది.
ఈ సమయం ఇద్దరు దుండగులు బైకుపై వచ్చారు. ఆమె మెడలోని రెండు తులాల బంగారు గొలుసు (Gold Chain) ను తెంపుకుని పారిపోయారు. బాధితులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నాలుగోటౌన్ ఎస్‌హెచ్‌వో సతీశ్ (4th Town SHO Satish) ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై విచారణ చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.