అక్షరటుడే, ఆర్మూర్: Armoor | తన భర్త నుంచి తనకు ప్రాణహాని ఉందని.. ఆయన నుంచి తనను కాపాడాలని ఓ మహిళ కోరింది. ఈ మేరకు ఆర్మూర్ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో మధులత మాట్లాడుతూ.. తన భర్త మదనం రాములుతో 20 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం (love marriage) జరిగిందన్నారు. మా ఇద్దరికి ప్రభుత్వ ఉద్యోగాలున్నాయని.. తమకు ఓ అమ్మాయి, ఒక అబ్బాయి ఉన్నారన్నారు. కాగా.. తన భర్త రాములు జక్రాన్‌పల్లి మండలంలోని (Jakranpally mandal) ఓ గ్రామానికి చెందిన యువతితో పరిచయం ఏర్పడిందన్నారు. అప్పటి నుంచి తనను ఆయన శారీరకంగా వేధిస్తున్నాడని ఆరోపించారు.
Armoor | ఎఫ్ఐఆర్ సైతం నమోదు..
కాగా.. ఈ విషయమై ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో (Armoor police station) ఫిర్యాదు చేయగా తన భర్తపై ఎఫ్ఐఆర్ సైతం నమోదైందన్నారు. అయినప్పటికీ తనను వేధించడం మానలేదని, ఆదివారం సదరు అమ్మాయితో తన భర్త వెళ్లిపోవడం జరిగిందన్నారు. అమ్మాయి కుటుంబ సభ్యులు సైతం పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదైందని తెలిపారు. భార్య ఉండగా మరో అమ్మాయితో వెళ్లడం ఎంతవరకు సమంజసమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై తన భర్తతో తనకు ప్రాణహాని ఉందని, తనకు న్యాయం చేయాలని ఆమె కోరింది.