అక్షరటుడే, పెద్ద కొడప్గల్ : Peddakodapgal Mandal | బంగ్లాపై దుస్తులు ఆరేస్తుండగా విద్యుత్‌షాక్ (Electric Shock) తగిలి ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన మండలంలోని లింగంపేట్ గ్రామంలో (Lingampet Village) శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్సై అరుణ్‌కుమార్ (SI Arun Kumar) తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో మోహని (25) ఇంట్లో దుస్తులు ఉతికిన అనంతరం బంగ్లాపై వాటిని ఆరేసేందుకు వెళ్లింది.
అక్కడ దుస్తులు ఆరేస్తుండగా విద్యుత్ తీగలకు తగిలి ఆమెకు షాక్ కొట్టింది. ఈ క్రమంలో ఆమె కిందపడిపోగా గుర్తించిన కుటుంబీకులు హుటాహుటిన ప్రభుత్వ ఆస్పత్రికి (Government Hospital) తరలించారు. కానీ అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అరుణ్‌కుమార్ పేర్కొన్నారు.