అక్షరటుడే/గాంధారి: Gandhari Police | వాగులో కొట్టుకుపోతున్న ఓ మహిళను ఎస్సై కాపాడారు. వివరాల్లోకి వెళ్తే.. గాంధారి మండలంలో వంతెన పక్కనే వద్ద ఇండియన్ ఆయిల్ పెట్రోల్ (Indian Oil) బంక్ సమీపంలో ఉన్నటువంటి ఇంట్లోకి గురువారం ఉదయం అకస్మాత్తుగా వరద వచ్చింది.
దీంతో బయటకు వచ్చిన మహిళ వరదలో కొట్టుకుపోయింది. వెంటనే ఆమె కేకలు వేయగా.. అక్కడే విధుల్లో ఉన్న ఎస్సై ఆంజనేయులు (SI Anjaneyulu) తన నడుముకు తాడు కట్టుకుని నీళ్లలోకి దూకారు. వరదలో కొట్టుకుపోతున్న మహిళతో మరో వ్యక్తిని స్థానికుల సాయంతో కాపాడారు. దీంతో వారిద్దరు సురక్షితంగా బయటపడ్డారు. ఎస్సై సాహసం చేసి ఇద్దరిని కాపాడడడంతో స్థానికులు ఆయనను అభినందించారు.
Gandhari Police | ప్రమాదపుటంచున వంతెన..
భారీ వర్షాల కారణంగా గాంధారి మండల కేంద్రంలో వంతెన కింద వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. వంతెనను తాకుతూ వరద వెళ్తోంది. వరద ఇలాగే ప్రవహిస్తే వంతెన ప్రమాదానికి గురికావొచ్చని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మునుపెన్నడూ లేనివిధంగా వర్షాల కారణంగా గంగమ్మ గుడి కూడా కొట్టుకుపోయిందని స్థానికులు పేర్కొన్నారు.
Gandhari Police | పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసిన అధికారులు..
గాంధారి మండల కేంద్రంలోని శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉన్న వారి కోసం దాదాపు 100 మందికి పునరవాసం కల్పించేలా (Rehabilitation centers) అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఇందులో భాగంగా మండలంలోని జిల్లా పరిషత్ హై స్కూల్, మజీద్ వద్ద ఉన్న ప్రైమరీ స్కూళ్లను ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు.