అక్షరటుడే, వెబ్డెస్క్ : Viral Video | ఈ మధ్య యూత్ ఇష్టానుసారంగా బైక్ డ్రైవ్ చేస్తుండడం వలన ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ఈ ప్రమాదాలలో కొందరు ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. అయినా వారిలో మార్పు అనేది కనిపించడం లేదు. తాజాగా రోడ్డుపై జరిగిన ఓ ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా(Social Media)లో తెగ వైరల్ అవుతోంది. ఈ సంఘటన చూసి అందరూ ఆశ్చర్యంతో పాటు భయానికి కూడా గురయ్యారు.
Viral Video | ఇలా తిరిగాయేంటి..
ఓ బిజీ రోడ్డుపై వేగంగా వచ్చిన రెండు బైక్‌లు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. అయితే ఊహించని విధంగా, ఢీకొన్న వెంటనే ఆ రెండు బైక్‌లు (Two Bikes) కలిసి పోయి ఒకదానికొకటి అతుక్కుని స్పిన్ అవుతూ రౌండ్‌లు తిరగడం మొదలుపెట్టాయి! వాటిని ఆపే ప్రయత్నం చేసినా ఆగకుండా అలానే తిరిగాయి. కొద్ది సేపటికి కాని అవి ఆగలేదు.. అయితే అప్పటికే రోడ్డుపై ఫుల్ ట్రాఫిక్ జామ్(Traffic Jam) అయింది. అక్కడే ఉన్న వాహనదారులు, పాదచారులు ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. కొంతమంది ఈ ఘట్టాన్ని ఫోన్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయగా, వీడియో వేగంగా వైరల్ అవుతుంది.. నెటిజన్లు ఈ దృశ్యాన్ని “రోడ్డుపై మెర్రిగోరౌండ్”, “కార్నివల్ రైడ్”, “అనుకోని యానిమేషన్ సీన్” అని కామెంట్లు చేస్తున్నారు.
ఘటనను ప్రత్యక్షంగా చూసినవారు తొలుత ఈ ప్రమాదాన్ని చూసి భయంతో పరుగులు తీశారు. అయితే అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ పెద్దగా గాయాలు కాలేదు. అందుకే ఆ తర్వాత ఈ ప్రమాదాన్ని ఒకవైపు ఫన్నీగా కూడా తీసుకున్నారు. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు, రోడ్డు భద్రతపై తీవ్రంగా చర్చిస్తున్నారు. ఓవర్ స్పీడ్, నిర్లక్ష్య డ్రైవింగ్ ఎంత ప్రమాదకరమో ఈ సంఘటన మరోసారి రుజువుచేసిందంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ప్రమాదానికి గల అసలైన కారణం ఏంటి? అనే విషయాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాద దృశ్యాన్ని పరిశీలించి, అవసరమైన చర్యలు తీసుకోనున్నట్టు సమాచారం.
View this post on Instagram