అక్షరటుడే, బాన్సువాడ: Banswada | మండలంలోని కొయ్యగుట్ట చౌరస్తాలో ఉన్న అమరవీరుల స్థూపం వద్ద శనివారం తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి (Jitta Balakrishna Reddy) మొదటి వర్ధంతిని నిర్వహించారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం (Telangana Activists Forum) ఆధ్వర్యంలో బాలకృష్ణారెడ్డి విగ్రహానికి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ప్రత్యేక తెలంగాణా కోసం బాలకృష్ణారెడ్డి చేసిన పోరాటాలను గుర్తు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా యువజన సంఘాలను ఐక్యం చేస్తూ.. బలోపేతం చేయడానికి జిట్టా ఫౌండేషన్ ఏర్పాటు చేసి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారని కొనియాడారు.
మాజీ సీఎం కేసీఆర్ (KCR) ఆధ్వర్యంలో ఏర్పాటైన బీఆర్‌ఎస్ పార్టీలో రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడిగా ఆయన కొనసాగి సేవలందించారని గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షుడు ఉడుత గంగాధర్, మండల అధ్యక్షుడు గంజివర్ చందు, కార్యదర్శి భాస్కర్, జిల్లా మీడియా కన్వీనర్ దండు విజయ్, ఎర్రవట్టి సాయిబాబా, మహేష్, బోడ చందర్, శ్యామ్, రాజు, దత్తు, యోగి, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.