అక్షరటుడే, వెబ్డెస్క్: Bus Accident | తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల రోడ్డు ప్రమాదాలు పెరిగాయి. ముఖ్యంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ప్రమాదాల బారిన పడుతుండడం గమనార్హం.
ఆంధ్రప్రదేశ్లో (Andhra Pradesh) ఓ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. నంద్యాల జిల్లా (Nandyal District) చాబోలు జాతీయ రహదారిపై వేగ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. నెల్లూరు నుంచి కర్నూలు వెళ్తుండగా శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆరుగులు ప్రయాణికులు గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. రోడ్డుపై పడిపోయిన బస్సును పక్కకు తొలగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Bus Accident | ఇంజినీరింగ్ కాలేజీ బస్సు
భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలో శుక్రవారం ఉదయం ఓ ఇంజినీరింగ్ కాలేజీ బస్సు బోల్తా పడింది. అశ్వాపురం మండలంలోని మండికుంట వద్ద పాల్వంచ కేఎల్ఆర్ కళాశాలకు చెందిన బస్సు ప్రమాదానికి గురైంది. ఎదురుగా వచ్చిన వాహనాన్ని తప్పించే క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. వారిని భద్రాచలం ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 69 మంది విద్యార్థులు ఉన్నారు.