అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy | క్షణికావేశంలో పలువురు ప్రాణాలు తీసుకుంటున్నారు. క్షణం ఆలోచించకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కుటుంబంలో చిన్న గొడవ జరిగిందని మనస్తాపం చెందిన ఓ యువకుడు కుంటలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శనివారం కామారెడ్డి మండలం (Kamareddy Mandal) శాబ్దిపూర్ తండాలో చోటుచేసుకుంది.
Kamareddy | మనస్తాపానికి గురై..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శాబ్దిపూర్ తండాకు (Shabdipur Thanda) చెందిన మలావత్ సాయికుమార్ (20) ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. శనివారం ఇంట్లో చిన్నపాటి గొడవ జరిగింది. దాంతో మనస్తాపానికి గురైన సాయికుమార్ తండా శివారులోని పుల్చేరు కుంటలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన తండావాసులు వెంటనే అతడిని నీటిలో నుంచి బయటకు తీయగా అప్పటికే మృతి చెందాడు. దాంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. చేతికందిన కొడుకు కళ్ల ముందే ఆత్మహత్యకు పాల్పడడంతో కుటుంబ సభ్యులకు తీరని శోకం మిగిలింది. మృతుడి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.