అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Budget 2026 | ఈయూతో వాణిజ్య ఒప్పందం దేశ భవిష్యత్‌కు కీలకమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) అన్నారు. పార్లమెంట్ వద్ద గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.
యూరోపియన్ యూనియన్ (European Union)తో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) ఆకాంక్షలున్న భారతదేశం కోసమేనని, తమకు తెరుచుకుంటున్న కొత్త మార్కెట్ల నుంచి ప్రయోజనం పొందాలని తయారీదారులను ప్రధాని కోరారు. కొత్త మార్కెట్ తెరుచుకుందని, 27 యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలకు నాణ్యమైన ఉత్పత్తులను అందించాలని ఆయన అన్నారు.
Budget 2026 | వికసిత్ భారత్ లక్ష్యంతో..
ఈ త్రైమాసికం చాలా సానుకూల దృక్పథంతో ప్రారంభమైందని మోదీ అన్నారు. ఆత్మ విశ్వాసం గల భారత్ ఇప్పుడు ప్రపంచానికి ఆశాకిరణంగా మారిందన్నారు. భారత్, యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో దేశ యువతకు ఎన్నో అవకాశాలు లభిస్తాయన్నారు. ఉత్పత్తి రంగానికి మరింత ఊపునివ్వనుందని చెప్పారు. బడ్జెట్ సమావేశాలు (Budget Sessions) చాలా కీలకమని ప్రధాని అన్నారు. 2047 వికసిత్ భారత్ లక్ష్యంతో బడ్జెట్ పెట్టబోతున్నట్లు తెలిపారు. తొమ్మిదో సారి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) బడ్జెట్ ప్రవేశ పెడుతున్నట్లు చెప్పారు. రాష్ట్రపతి ప్రసంగం 140 కోట్ల మంది భారతీయుల విశ్వాసానికి, ఆకాంక్షలకు, ముఖ్యంగా యువత ఆకాంక్షలకు ప్రతిబింబమన్నారు.