అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | పదో తరగతి విద్యార్థి మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలని భారత్ ఐక్య విద్యార్థి ఫెడరేషన్ (Bharatiya Uyika Vidyarthi Federation) నిజామాబాద్ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు నగరంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మహేష్ మాట్లాడుతూ.. చందూరు మండల కేంద్రంలోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్లో (Telangana Minority Residential School) పదో తరగతి చదువుతున్న విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందాడన్నారు. గతేడాది వర్నిలోని పాలిటెక్నిక్ వ్యవసాయ కాలేజీలో ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ హాస్టల్లోనూ (Government Medical College hostel) ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకుందని ఈ సంఘటనలు మరవకముందే చందూర్లో ఆదివారం విద్యార్థి బలవన్మరణానికి పాల్పడడం విషాదకరమన్నారు.
అయితే విద్యార్థి చనిపోవడానికి కారణాలు తెలియదని విద్యాసంస్థ ప్రతినిధులు చెబుతుండడం చూస్తుంటే అక్కడ పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్టు కనబడుతోందన్నారు. హాస్టల్ గదిలో విద్యార్థులు అందరూ ఉన్న తర్వాత కూడా విద్యార్థి ఆత్మహత్యకు ఎలా పాల్పడతాడని వారు ప్రశ్నించారు. అలాగే బాధిత విద్యార్థి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదు కోరారు. అలాగే విద్యార్థి మృతికి గల కారణాలను గుర్తించడంతో పాటు సంబంధిత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూఎస్ఎఫ్ఐ నగర అధ్యక్షుడు గణేష్, నగర నాయకులు జస్వంత్ పాల్గొన్నారు.
