అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Air India | ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. పైలెట్ ముందుగానే గుర్తించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.ఎయిర్ ఇండియా విమానాల్లో సాంకేతిక లోపాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి.
సోమవారం ఉదయం శంషాబాద్ (Shamshabad) నుంచి సిలిగురి వెళ్తున్న ఫ్లైట్‌లో టెక్నికల్ ఇష్యూ తలెత్తింది. టేకాఫ్ అవుతున్న సమయంలో గుర్తించిన పైలెట్ అప్రమత్తం అయ్యాడు. వెంటనే ఏటీసీకి సమాచారం అందించాడు. దీంతో విమానాన్ని తిరిగి టెర్మినల్‌కు తరలించారు. కాగా ఆ సమయంలో విమానంలో 137 మంది ప్రయాణికులు ఉన్నారు.
Air India | టేకాఫ్ అవుతుండగా..
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (Shamshabad International Airport) నుంచి సిలిగురి వెళ్లడానికి ఫ్లైట్ సిద్ధమైంది. అప్పటికే ప్రయాణికులు కూర్చున్నారు. రన్‌వే టేకాఫ్ అవుతుండగా.. పైలెట్ సమస్యను గుర్తించడంతో ప్రమాదం తప్పింది. దీంతో వెంటనే విమానాన్ని పార్కింగ్ ప్రాంతానికి తరలించారు. సాంకేతిక నిపుణులు మరమ్మతులు చేస్తున్నారు. ప్రయాణికుల తరలింపు కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని ఎయిర్ ఇండియా తెలిపింది.
Air India | పొగమంచుతో విమానాలు రద్దు
పొగ మంచు (Fog) కారణంగా సోమవారం తెల్లవారుజామున పలు విమానాలు రద్దు అయ్యాయి. ఉత్తర భారత దేశంలో పొగమంచు కమ్మేసింది. దీంతో విజిబిలిటీ తక్కువగా ఉండటంతో పలు విమానాలు రద్దు కాగా.. మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. హిమపాతం కారణంగా లేహ్ విమానాశ్రయం (Leh Airport)లో విమాన కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఇండిగో తెలిపింది.