అక్షరటుడే, వెబ్ డెస్క్: teacher suspended : టీచర్లు అంటేనే క్రమ శిక్షణకు మారుపేరు అంటారు..! కానీ ఓ టీచర్ అన్నీ మరిచి అనుచితంగా ప్రవర్తించాడు. చివరకు విధుల నుంచి సస్పెండ్ అయ్యాడు.
టీచర్ల శిక్షణలో అనుచితంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిని నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ(Nizamabad district education department) అధికారులు సస్పెండ్ చేశారు. మేండోరా మండలం బుస్సాపూర్ పాఠశాలకు చెందిన ఫిజిక్స్ టీచర్ నవీన్ కుమార్ ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమం(teacher training program)లో అనుచితంగా ప్రవర్తించారు.
శిక్షణ సెంటర్ కో-ఆర్డినేటర్స్(center coordinators), రిసోర్స్ పర్సన్ల(resource persons)పై తిట్ల దండకం కొనసాగించారు. మధ్యాహ్న భోజనం, ఛాయ్ ఎందుకు ఇవ్వడం లేదంటూ.. నిర్వాహకులను బూతులు తిట్టారు. అలాగే జిల్లా విద్యాశాఖ అధికారిపై సైతం అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన అదికారులు నవీన్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఉపాధ్యాయుడు నవీన్ అనుచిత ప్రవర్తన వల్ల చర్యలు తీసుకున్నట్లు అధికారులు వివరించారు.
