అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Gadugu Gangadhar | కేంద్ర ప్రభుత్వం (Central Government) పసుపు బోర్డును తెలంగాణలో ఏర్పాటు చేయడం బాగానే ఉన్నా.. పంటకు మద్దతు ధర కల్పిస్తేనే రైతులు ప్రయోజనం చేకూరుతుందని రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ అన్నారు. హైదరాబాద్ నగరంలోని సోమాజిగూడ పార్క్ హోటల్లో ఏర్పాటు చేసిన టర్మరిక్ వాల్యూ చైన్ సమ్మిట్ (Turmeric Value Chain Summit)లో ఆయన మాట్లాడారు.
సదస్సులో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు (Thummala Nageswara Rao), పసుపు బోర్డు ఛైర్మన్ గంగారెడ్డి, రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, వ్యవసాయ శాఖ సెక్రెటరీ సురేంద్ర మోహన్, పసుపు బోర్డు సెక్రెటరీ భవానీ శ్రీ పాల్గొన్నారు. గడుగు గంగాధర్ మాట్లాడుతూ.. సాంప్రదాయ పంట అయిన పసుపును కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
Gadugu Gangadhar | మంచి ఔషధం
ప్రతి ఇంట్లో శుభకార్యాలకు పసుపును వాడుతారన్నారు. యాంటీబయోటిక్‌గా పసుపు ఉపయోగ పడుతుందని చెప్పారు. ఇప్పటికి పాలల్లో పసుపు కలుపుకొని తాగేవారు ఉన్నారన్నారు. పసుపు మంచి ఔషధంలా పనిచేస్తుందన్నారు. పసుపు బోర్డు ఛైర్మన్ గంగారెడ్డి నిజామాబాద్ జిల్లా (Nizamabad District) వాసి కావడం సంతోషంగా ఉందని చెప్పారు. రాష్ట్రంలో పసుపు సాగు పెరగాలని ఆయన ఆకాంక్షించారు.
Gadugu Gangadhar | అండగా ఉంటాం
రైతులకు ఏ సమస్య వచ్చిన రైతు కమిషన్ అండగా ఉంటుందని గడుగు హామీ ఇచ్చారు. ములుగులో 660 మంది గిరిజన రైతులు విత్తనోత్పత్తి చేసి నష్టపోతే రూ.4 కోట్ల నష్టపరిహారం వచ్చేలా చేశామని తెలిపారు. రైతు కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి మంచి కమిట్మెంట్ ఉన్న నాయకుడని చెప్పారు. నిత్యం రైతుల కోణంలో ఆలోచనలు చేస్తుంటారని తెలిపారు.