అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Nizamabad City | జీవితంపై విరక్తితో ఓ వృద్ధుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. నగరంలోని గాజుల్‌పేట్‌లో సమీపంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని గాజుల్పేట్ (Gajulpet) ప్రాంతంలోని గురుద్వార్ (Gurudwara) వద్ద ఖాజా మొయినుద్దీన్ జీవితంపై విరక్తితో కత్తితో గాయపర్చుకున్నాడు. స్థానికులు 108కు ఫోన్ చేయగా వారు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని అతడికి ప్రథమచికిత్స చేశారు. అనంతరం క్షతగాత్రుడికి జీజీహెచ్‌కు తరలించారు. ఈ సందర్భంగా సమయానికి వచ్చి వ్యక్తి ప్రాణాలు కాపాడిన 1087 సిబ్బంది ఈఎంటీ రాములు, పైలెట్ అజయ్‌ను స్థానికులు అభినందించారు.
