అక్షరటుడే, భీమ్గల్ : Vedic Maths | పట్టణంలోని శ్రీ సరస్వతీ విద్యా మందిర్ (Sri Saraswati Vidya Mandir) ఉన్నత పాఠశాలకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని యెన్ను శ్రీకరి రాష్ట్రస్థాయి వేదిక్ మ్యాథ్స్ పోటీలకు ఎంపికైంది. ఆర్మూర్లో మంగళవారం ‘విశ్వం ఎడ్యుటెక్’ (Vishwam Edutech) ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి పోటీల్లో శ్రీకరి అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఈ ఘనత సాధించారు.
భీమ్గల్కు (Bheemgal) చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు యొన్ను శ్రీధర్ కుమార్తె అయిన శ్రీకరి, వేగంగా గణిత సమస్యలను సాధించి న్యాయ నిర్ణేతల ప్రశంసలు పొందింది. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థినిని పాఠశాల యాజమాన్యం (School Management) మరియు ఉపాధ్యాయులు ఘనంగా అభినందించారు.
Vedic Maths | ప్రతిభకు ప్రశంసల జల్లులు..
రాష్ట్రస్థాయికి (State Level) ఎంపికైన శ్రీకరిని పాఠశాల ప్రధానాచార్యులు రాస రవికుమార్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జి. నర్సారెడ్డి, అకడమిక్ ఇన్ఛార్జి పి.సాయిచరణ్ ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థిని ఈ స్థాయికి చేరడంలో కృషి చేసిన వేదిక్ మ్యాథ్స్ ఉపాధ్యాయులు సీహెచ్.కార్తీక్, ఎన్.రాకేష్, ఆర్.రవికుమార్, డి.స్రవంతిలను కూడా అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ ప్రతిభ చాటి పాఠశాలకు, భీమ్గల్ ప్రాంతానికి పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.