అక్షరటుడే, వెబ్డెస్క్: Germany | జర్మనీలో తెలంగాణ విద్యార్థి మృతి చెందాడు. జనగామ జిల్లా (Jangaon District) చిల్పూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన తోకల హృతిక్రెడ్డి ఉన్నత చదువుల కోసం జర్మనీ వెళ్లాడు.
హృతిక్రెడ్డి ఉంటున్న అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం (Fire Accident) జరిగింది. దీంతో అతడు మంటల నుంచి తప్పించుకోవడానికి భవనంపై నుంచి కిందకు దూకాడు. ఈ క్రమంలో హృతిక్రెడ్డి తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. హృతిక్ మరణ వార్త తెలియడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి.
ఇటీవల అమెరికా (America)లో సైతం ఇద్దరు తెలంగాణ యువతులు మృతి చెందిన విషయం తెలిసిందే. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలానికి చెందిన పుల్ల ఖండు మేఘన (24), కడియాల భావన (24) ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. చదువు అయిపోవడంతో ఉద్యోగం కోసం వెతుకుతున్న వీరు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. విహార యాత్రకు వెళ్లి వస్తుండగా వీరు ప్రయాణిస్తున్న కారు లోయలో పడిపోయింది.