41
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Central Water Commission | రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదాల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం (Central Government) ప్రత్యేక కమిటీని నియమించింది. కేంద్ర జలసంఘం ఛైర్మన్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీని నోటిఫై చేసింది. ఈ మేరకు జలశక్తి శాఖ (Ministry of Water Resources) శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీలో సభ్యులుగా.. కృష్ణా, గోదావరి బోర్డుల ఛైర్మన్లు, ఎన్‌డబ్ల్యూడీఏ చీఫ్ ఇంజినీర్, సీడబ్ల్యూసీ చీఫ్ ఇంజినీర్లతో పాటు తెలంగాణ (Telangana), ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రాల జలవనరులశాఖ ఉన్నతాధికారులు ఉన్నారు.