Homeజిల్లాలునిజామాబాద్​Intermediate Education | ఉత్తమ ఫలితాల సాధనకు 90 రోజుల ప్రణాళిక

Intermediate Education | ఉత్తమ ఫలితాల సాధనకు 90 రోజుల ప్రణాళిక

ఇంటర్​లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు 90 రోజుల ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేయాలని డీఐఈవో రవికుమార్ ఆదేశించారు. జిల్లాకేంద్రంలో ప్రభుత్వ జూనియర్​ కళాశాలల ప్రిన్సిపాళ్లతో సమావేశం నిర్వహించారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు : Intermediate Education | ఇంటర్​లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు 90 రోజుల ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేయాలని జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ (Inter Education Officer Ravikumar) ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ఇంటర్ విద్యాధికారి కార్యాలయంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల (Government Junior College) ప్రిన్సిపాళ్లతో శుక్రవారం సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నవంబర్, డిసెంబర్ నెలలో సిలబస్ పూర్తి చేయడంతో పాటు ప్రయోగ పరీక్షలను నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి విద్యార్థి కళాశాలకు తప్పనిసరిగా హాజరయ్యేట్లు చూడాలని సూచించారు. వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. టీచింగ్ డైరీలను కూడా ఆన్​లైన్​​ ద్వారానే నమోదు చేయాలని ఆదేశించారు. యూడైస్, అపార్ పెన్ నంబర్లను తొందరగా పూర్తి చేయాలని తెలిపారు.