అక్షరటుడే, వెబ్డెస్క్ : America | అమెరికాను మంచు తుపాన్ వీడటం లేదు. భారీగా మంచు కురుస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వేల సంఖ్యలో విమానాలు రద్దు అయ్యాయి.
అగ్రరాజ్యం అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో రెండు రోజులుగా మంచు తుపాన్ (Snowstorm) బీభత్సం సృష్టిస్తోంది. భారీగా హిమపాతం చోటు చేసుకుంటుండటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఇప్పటి వరకు 14 వేల విమాన సర్వీసులను రద్దు చేశారు. నేడు, రేపు న్యూయార్క్ (New York), న్యూజెర్సీలకు వెళ్లే ఎయిరిండియా విమానాలు రద్దు అయ్యాయి. ఈ మేరకు ప్రయాణికులకు ఎయిరిండియా అడ్వైజరీ జారీ చేసింది. మంచు తుపాన్ ప్రభావంతో అమెరికాలోని సగం జనాభాపై ఉన్నట్లు రవాణా కార్యదర్శి సీన్ డఫీ తెలిపారు.
America | నిలిచిన విద్యుత్ సరఫరా
తుఫాను కారణంగా వారాంతంలో కనీసం 14 వేల విమానాలు రద్దు అయ్యాయి. చాలా ప్రాంతాల్లోవిద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మంచుతో ప్రధాన రహదారులు దెబ్బతిన్నాయి. ఒక్లహోమా, ఐయోవా, టేనస్సీ, కాన్సాస్, టెక్సాస్ (Texas), మిస్సోరి ప్రాంతాలతో సహా మైదానాలు, దక్షిణ, మిడ్వెస్ట్లోని కొన్ని ప్రాంతాలలో భారీగా మంచు కురుస్తోంది. శీతల గాలులు వీస్తుండగటంతో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
America | పలు రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) శనివారం నాటికి 16 రాష్ట్రాలు, వాషింగ్టన్లో ఎమర్జెన్సీ విధించారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టి నోయెమ్ కోరారు. ఐదు నుంచి ఆరు నిమిషాలు బయట ఉండటం కూడా ఆరోగ్యానికి ప్రమాదకరం కావచ్చు అని న్యూయార్క్ గవర్నర్ కాథీ హోచుల్ ప్రజలను హెచ్చరించారు. కాగా మంచు తుపాన్ కారణంగా పలువురు చనిపోయారు. శనివారం న్యూయార్క్లో ముగ్గురు మృతి చెందారు.