అక్షరటుడే, వెబ్‌డెస్క్ : GST On Tobacco | సిగరెట్, బీడీ, పాన్ మసాలా వినియోగించే వారికి ప్రభుత్వం షాకింగ్ న్యూస్ చెప్పింది. వాటి ధరలు ఫిబ్రవరి 1 నుంచి భారీగా పెంచనుంది.కేంద్ర ప్రభుత్వం (Central Government) ఇటీవల జీఎస్టీలో సంస్కరణలు తీసుకొచ్చింది.
జీఎస్టీ స్లాబ్‌లను మార్పు చేసింది. దీంతో పలు వస్తువుల ధరలు భారీగా పెరిగాయి. అయితే సిగరెట్, పాన్ మసాల, పొగాకు సంబంధిత ఉత్పత్తులపై 40 శాతం జీఎస్టీ విధించనున్నట్లు తెలిపింది. అయితే ఈ మేరకు తాజాగా నిర్ణయం తీసుకుంది. బీడీలపై 18 శాతం జీఎస్టీ వేసింది. పాన్ మసాలాపై ఆరోగ్య, జాతీయ భద్రత సెస్ వేసింది. జీఎస్టీ, అదనపు ఎక్సైజ్ ట్యాక్స్‌తో సిగరెట్, బీడీ ధరలు పెరగనున్నాయి. ప్రస్తుతం రూ.18 ఉన్న సిగరెట్ ధర (Cigarette Price) రూ.72కు పెరగనుంది.
GST On Tobacco | ఫిబ్రవరి 1 నుంచి..
పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీ, పాన్ మాసాలపై హెల్త్, నేషనల్ సెక్యూరిటీ సెస్కి సంబంధించిన బిల్లులను ఇటీవల పార్లమెంట్ ఆమోదించింది. దీంతో ఆయా ఉత్పత్తుల రేట్లు పెరగనున్నాయి. కొత్త రేట్లు 2026 ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి రానున్నాయి. పొగాకు ఉత్పత్తులపై ప్రస్తుతం 28శాతం జీఎస్టీ ఉంది. ఇక నుంచి 40 శాతం జీఎస్టీ అమలు చేయనున్నారు. బీడీలపై మాత్రం 18శాతం ట్యాక్స్ వేస్తారు.
ఆర్థిక మంత్రిత్వ శాఖ (Finance Ministry) చూయింగ్ టొబాకో, జర్దా సెంటెడ్ టొబాకో, గుట్కా ప్యాకింగ్ మెషీన్స్ నియమాలను నోటిఫై చేసింది. పాన్ మసాలా తయారీపై కొత్త సెస్సు, పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకానికి మార్గం సుగమం చేసే రెండు బిల్లులను పార్లమెంట్ ఆమోదించింది. దీని ప్రకారం పాన్ మసాలా తయారీ, కేంద్రాల సామర్థ్యాన్ని బట్టి సెస్ చెల్లించాల్సి ఉంటుంది. కొత్త పన్ను విధానంతో వచ్చే ఆదాయాన్ని పబ్లిక్ హెల్త్, నేషనల్ సెక్యూరిటీ బలోపేతానికి ఖర్చు చేయనున్నారు. కాగా ధరల పెరుగుదలతో విక్రయాలు తగ్గే అవకాశం ఉంది. దీంతో సిగరెట్ కంపెనీల షేర్లు నష్టాల బాట పట్టాయి.