Homeలైఫ్​స్టైల్​Fish Samosa | టేస్టీ స్నాక్.. చేప సమోసా.. ఇలా చేస్తే లొట్టలేసుకుని లాగిస్తారు!

Fish Samosa | టేస్టీ స్నాక్.. చేప సమోసా.. ఇలా చేస్తే లొట్టలేసుకుని లాగిస్తారు!

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్: Fish Samosa | సాధారణంగా మనం బంగాళాదుంప, ఉల్లిపాయల సమోసాలను తింటూ ఉంటాం. కానీ, మీరు ఎప్పుడైనా చేప సమోసా గురించి విన్నారా? సాయంత్రం వేళ అద్భుతమైన రుచితో కూడిన ఈ చేప సమోసా మీ అతిథులను ఆశ్చర్యపరుస్తుంది.

ఈ స్నాక్ రుచిలోనే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ప్రొటీన్ పుష్కలంగా ఉండే చేపలతో చేసే ఈ సమోసా, సంప్రదాయ వంటకానికి విభిన్నంగా ఉంటుంది. తయారు చేయడం చాలా సులభం, మరి దీనికి కావలసిన పదార్థాలు(Ingredients), తయారీ విధానం చూసేద్దామా..

Fish Samosa | చేప సమోసా తయారీ విధానం:

కావాల్సిన పదార్థాలు:

సమోసా పిండి కోసం:
మైదా పిండి: 1 కప్పు
నూనె: 2-3 టేబుల్ స్పూన్లు
ఉప్పు: రుచికి సరిపడా
నీళ్లు: అవసరమైనంత

కూర(Curry) కోసం:
చేప(Fish) ముక్కలు (బోన్ లెస్): 200 గ్రాములు
ఉల్లిపాయలు(Onion): 1 (చిన్నవిగా తరిగినవి)
అల్లం, వెల్లుల్లి పేస్ట్(Ginger, garlic paste): 1 టీ స్పూన్
కారం(Chillie powder): 1/2 టీ స్పూన్
ధనియాల పొడి(Coriander powder): 1/2 టీ స్పూన్
గరం మసాలా(Garam masala): 1/2 టీ స్పూన్
పసుపు(Turmeric): చిటికెడు
కొత్తిమీర(Coriander): కొద్దిగా
నూనె(OIL): 2-3 టేబుల్ స్పూన్లు

తయారీ విధానం:

ముందుగా మైదా పిండి, నూనె, ఉప్పు కలిపి గట్టిగా చపాతీ పిండిలా కలుపుకోండి. దీనిపై తడి బట్ట కప్పి పక్కన పెట్టండి.

చేప ముక్కలను ఉప్పు, పసుపు వేసి ఉడికించి, ముళ్ళు లేకుండా చిన్న ముక్కలుగా చేయండి.

ఒక పాన్‌లో నూనె వేసి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించండి. అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేగించండి.

పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి కలపండి. తర్వాత చేప ముక్కలు వేసి బాగా కలిపి, కొత్తిమీరతో గార్నిష్ చేయండి. కూరను చల్లారనివ్వండి.

ఇప్పుడు సమోసా పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని, పొడవాటి పూరీలా వత్తి, మధ్యలో కట్ చేయండి.

ఒక అర్ధ వృత్తాన్ని కోన్‌లా చుట్టి, అందులో చేప కూరను నింపి, మూసివేయండి.

నూనెలో బంగారు రంగు వచ్చే వరకు వేయించండి.

ఈ రుచికరమైన చేప సమోసాలను గ్రీన్ చట్నీ లేదా కెచప్‌తో వేడివేడిగా సర్వ్ చేయండి. ఈ సరికొత్త వంటకంతో మీ సాయంత్రపు స్నాక్ సమయాన్ని మరింత ఆనందంగా మార్చుకోండి.