అక్షరటుడే, వెబ్‌డెస్క్: RI Caught by ACB | అవినీతి అధికారులు మారడం లేదు. పనుల నిమిత్తం కార్యాలయాలకు వచ్చే ప్రజలను లంచాల పేరిట వేధిస్తున్నారు. పైసలు ఇవ్వకపోతే పనులు చేయడం లేదు.
నల్గొండ జిల్లా (Nalgonda district) గుర్రంపోడ్ మండల తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం ఏసీబీ అధికారులు దాడులు చేశారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ మహ్మద్ అబ్దుల్ హకీం లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మండలంలోని ఊటవెల్లి గ్రామానికి చెందిన ఓ రైతు తన భూమిని ఆన్లైన్ ఆర్ఓఆర్ (1-బి రిజిస్టర్)లో నమోదు చేసుకోవడానికి ఏళ్లుగా తిరుగుతున్నాడు. తనకు రూ.50 వేలు ఇస్తే సమస్య పరిష్కరిస్తానని చెప్పాడు. దీంతో సదరు రైతు రూ.30 వేలు ఇచ్చి పని చేయాలని కోరాడు. మిగతా రూ.20 వేలు కూడా ఇవ్వాలని ఆర్ఐ హకీం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు సోమవారం ఫిర్యాదుదారుడి నుంచి లంచం తీసుకుంటుండగా.. ఆర్ఐని అధికారులు పట్టుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
RI Caught by ACB | లంచం అడిగితే ఫోన్ చేయండి
ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగితే వెంటనే ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఫిర్యాదు చేయడానికి ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064ను సంప్రదించాలని పేర్కొన్నారు. అలాగే ఏసీబీ తెలంగాణ వెబ్సైట్ (ACB Website)తో పాటు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు whatsapp (9440446106), facebook (Telangana ACB), X/గతంలో ట్విట్టర్ (@Telangana ACB) ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని వెల్లడించారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.