అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | కంబోడియాలో (Cambodia) దేవునిపల్లి (Devunipalli village) వాసి మృతిచెందాడు. కాగా.. అక్కడే ఆయన అంత్యక్రియలు పూర్తి చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి గ్రామానికి చెందిన భూంరావు గారి కిరణ్(37) హోటల్ మేనేజ్మెంట్ చేసేందుకు కంబోడియాలోని నాంఫెల్ వెళ్లాడు. ఈనెల 14న అక్కడే గుండెపోటుతో మృతి చెందాడు.
అయితే కిరణ్ మృతదేహాన్ని ఇక్కడికి తీసుకొచ్చేందుకు దాదాపు రూ.30 లక్షల వరకు ఖర్చవుతుందని తెలియడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. అంత ఖర్చు పెట్టలేని స్థితిలో కేవలం మృతుడి తల్లి, భార్య ఇద్దరు కుమారులు కంబోడియాలోని నాంఫెల్కు వెళ్లారు. అక్కడ కిరణ్ మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు బోరున విలపించారు. అంత్యక్రియలను శుక్రవారం నాంఫెల్లోనే పూర్తిచేశారు.