అక్షరటుడే, వెబ్‌డెస్క్ : OnePlus 15R 5G | చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ (Smart Phone)ల తయారీ సంస్థ వన్‌ప్లస్.. తాజాగా మరో మోడల్‌ను లాంచ్ చేసింది. మిడ్‌రేంజ్‌లో భారీ బ్యాటరీతో వన్‌ప్లస్ 15ఆర్ (OnePlus 15R) మోడల్‌ను తీసుకువచ్చింది. ఇది ప్రపంచంలోనే స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్‌ను ఉపయోగించిన తొలి మోడల్ అని కంపెనీ పేర్కొంటోంది. ఈనెల 22వ తేదీనుంచి సేల్స్ ప్రారంభం కానున్నాయి. అమెజాన్ (Amazon)తోపాటు వన్‌ప్లస్ ఇండియా ఆన్లైన్ స్టోర్లు, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలోనూ అందుబాటులో ఉండనుంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇలా ఉన్నాయి.
డిస్ప్లే : 6.83 అంగుళాల ఫుల్హెచ్డీ + 1.5కే అమోలెడ్ స్క్రీన్‌ను అమర్చారు. ఇది 165 Hz రిఫ్రెష్ రేట్, 3,200 టచ్ శాంప్లింగ్ రేట్, 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ను అందిస్తుంది. ఐపీ 66, 68, 69, 69కే రేటింగ్స్ ఉన్నాయి. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i రక్షణ ఇస్తుంది. బయట వెలుతురులోనూ స్పష్టంగా కనిపించేందుకు సన్ డిస్ప్లే ఫీచర్ ఇచ్చారు.
సాఫ్ట్వేర్ : ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్ సెట్‌ను అమర్చారు. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 16తో పనిచేస్తుంది. నాలుగు ఓఎస్(OS) అప్డేట్లు, ఆరేళ్లపాటు సెక్యూరిటీ అప్డేట్లు అందించనున్నట్లు కంపెనీ తెలిపింది.
కెమెరా సెటప్ : 50 ఎంపీ ఐఎంఎక్స్ 906 మెయిన్ కెమెరాతోపాటు 8 ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్ డ్యుయల్ కెమెరా సెటప్ ఉంది. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 32 ఎంపీ కెమెరా ఇచ్చారు.
బ్యాటరీ సామర్థ్యం : 7400 mAh బ్యాటరీ అమర్చారు. ఇది వన్‌ప్లస్ ఫోన్లలో అతిపెద్ద బ్యాటరీ అని కంపెనీ పేర్కొంది. 80w ఫాస్ట్ చార్జింగ్తోపాటు బైపాస్, రివర్స్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. నాలుగేళ్ల తర్వాత కూడా బ్యాటరీ 80 శాతం సామర్థ్యంతో పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది.
వేరియంట్స్ : చార్కోల్ బ్లాక్, మింట్ బ్రీజ్, ఎలక్ట్రిక్ వైలెట్ కలర్స్‌లో అందుబాటులో ఉండనుంది.
12 జీబీ, 256 జీబీ వేరియంట్ ధర రూ. 47,999.
12 జీబీ, 512 జీబీ వేరియంట్ ధర రూ. 52,999.
కార్డ్ ఆఫర్స్ : యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌ల కార్డులతో కొనుగోలు చేస్తే బేస్ వేరియంట్ మోడల్ రూ. 44,999 కి, 512 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ. 47,999 కి లభించనుంది.