76
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Realme 16 Pro Plus 5G | చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ (Smart Phone)ల తయారీ కంపెనీ అయిన రియల్మీ భారతదేశ మార్కెట్లోకి మరో మోడల్‌ను రిలీజ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. రియల్మీ 16 సిరీస్‌లో ప్రో ప్లస్ మోడల్‌ను వచ్చేనెల 6వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనుంది. అద్భుతమైన ఫీచర్లతో తీసుకువస్తున్నట్లు లీకుల ద్వారా తెలుస్తోంది. ఫ్లిప్‌కార్ట్ (Flipkart) తోపాటు కంపెనీ వెబ్సైట్లోనూ అందుబాటులో ఉండనుంది. ఆన్లైన్ ప్లాట్‌ఫాంల ద్వారా లీకైన సమాచారం మేరకు రియల్మీ 16 ప్రో ప్లస్మోడల్ స్పెసిఫికేషన్స్ ఇలా ఉండే అవకాశాలున్నాయి.
- 6.8 inch ఓఎల్ఈడీ డిస్ప్లే ఉంది. ఇది 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, 1280 * 2800 పిక్సల్స్ రిజల్యూషన్‌తో వస్తోంది. ఐపీ68, ఐపీ69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ కలిగి ఉంటుంది.
- స్నాప్ డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్ అమర్చారు. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత రియల్మీ యూఐ 7.0 ఆపరేటింగ్ సిస్టం(OS)తో పనిచేయనుంది.
- వెనకవైపు 200 మెగా పిక్సెల్ మెయిన్ పోర్ట్రయిట్ కెమెరాతో పాటు 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 50 మెగా పిక్సెల్ టెలిఫొటో లెన్స్‌తో కూడిన ట్రిపుల్ కెమెరా సెట్ అప్ అమర్చారు. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.
- 7000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉందనుంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.
- ఈ ఫోన్ బ్లాక్, బ్లూ, గోల్డ్ కలర్స్‌లో నాలుగు వేరియంట్లలో లభించనుంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 12 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 12 జీబీ ర్యామ్, 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్ ఉండనున్నాయి. ధర రూ. 30 వేలనుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.