అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) స్వల్ప ఒడిదుడుకుల మధ్య లాభాల బాటలో సాగుతోంది. గురువారం ఉదయం సెన్సెక్స్(Sensex) 35 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 196 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి 283 పాయింట్లు తగ్గింది.
నిఫ్టీ 44 పాయింట్ల లాభంతో ప్రారంభమై 24 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి 80 పాయింట్లు కోల్పోయింది. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 80 పాయింట్ల లాభంతో 85,301 వద్ద, నిఫ్టీ (Nifty) 35 పాయింట్ల లాభంతో 26,165 వద్ద ఉన్నాయి. భారత్ మినహా ప్రధాన దేశాల స్టాక్ మార్కెట్లకు ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా సెలవు కావడంతో మన మార్కెట్లో తక్కువ వాల్యూమ్స్ నమోదవుతున్నాయి.
ఎఫ్ఎంసీజీలో అమ్మకాల ఒత్తిడి..
బీఎస్ఈలో ఎఫ్ఎంసీజీ సెక్టార్లో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ 2.55 శాతం, హెల్త్‌కేర్ 0.30 శాతం నష్టాలతో ఉన్నాయి. టెలికాం 1.86 శాతం, యుటిలిటీ 1.42 శాతం, ఇన్ఫ్రా 0.93 శాతం, పవర్ 0.90 శాతం, సర్వీసెస్ 0.75 శాతం, ఆటో 0.67 శాతం, పీఎస్‌యూ 0.46 శాతం, మెటల్ 0.45 శాతం, ఐటీ 0.34 శాతం లాభాలతో సాగుతున్నాయి. లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.20 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.11 శాతం లాభంతో, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.03 శాతం నష్టంతో ఉన్నాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 23 కంపెనీలు లాభాలతో ఉండగా.. 7 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి.
ఎటర్నల్ 2.36 శాతం, ఎంఅండ్ఎం 1.56 శాతం, ఎన్టీపీసీ 1.29 శాతం, ఎల్టీ 1.10 శాతం, ఇన్ఫోసిస్ 1.04 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : ఐటీసీ 7.85 శాతం, బీఈఎల్ 0.70 శాతం, బజాజ్ ఫైనాన్స్ 0.57 శాతం, హెచ్‌యూఎల్ 0.36 శాతం, సన్‌ఫార్మా 0.36 శాతం నష్టాలతో ఉన్నాయి.